Amala Akkineni: “ఈ సినిమాతో నా మూడో కొడుకు దొరికాడు”.. ఎమోషనల్ అయిన అక్కినేని అమల
అక్కినేని అమల(Amala Akkineni).. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన అమల. ఆతర్వాత కింగ్ నాగార్జునను పెళ్ళాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకు దూరం అయ్యి ఇంటిబాధ్యతలను నిర్వర్తిస్తున్నారు
అక్కినేని అమల(Amala Akkineni).. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన అమల. ఆతర్వాత కింగ్ నాగార్జునను పెళ్ళాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా సినిమాలకు దూరం అయ్యి ఇంటిబాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అలాగే పలు సేవాకార్యక్రమాలు కూడా చేస్తున్నారు అమల. అయితే ఈ మధ్య కాలంలో అమల తిరిగి సినిమాల్లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈస్ బ్యూటీఫుల్ సినిమాలో అమల నటించారు. చాలా కాలం తర్వాత కెమెరా ముందుకు వచ్చిన అమల మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి తల్లిపాత్రలో అలరించడానికి రెడీ అయ్యారు. యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ఒకే ఒక్క జీవితం సినిమాలో శర్వానంద్ తల్లిగా నటీ నటించారు అమల. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ లో అమల మాట్లాడుతూ..
పదేళ్ళ తర్వాత తెలుగు సినిమా చేస్తున్నా. మంచి కథని తీసుకొచ్చి అందులో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడు శ్రీకార్తిక్ కి థాంక్స్ అన్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రభు గారు చాలా ధైర్యంగా మంచి కంటెంట్ ని ఇవ్వాలనే ఉద్దేశం తో ఈ సినిమాని గ్రాండ్ గా నిర్మించారు. శర్వానంద్ కి తల్లిగా చేశాను. ఈ సినిమాతో నా మూడో కొడుకు శర్వా అయ్యాడు అన్నారు. అయితే ఈ సినిమా అంతా తల్లిప్రేమ గురించి కాదు. అమ్మ ఎల్లప్పుడూ ఉండలేదు కదా. చాలా అద్భుతమైన ఎలిమెంట్స్ ఈ కథలో వున్నాయి. ఈ సినిమా ముగ్గురి జర్నీ గురించి. ఆ ముగ్గురు కాలంతో ఆడుకుంటూ దాన్ని కరెక్ట్ చేసినప్పుడు విధి మాత్రం మారలేదు. ఇది చాలా స్పెషల్ మూవీ. థియేటర్ కి వెళ్లి చూడండి. మిమ్మల్ని కదిలిస్తుంది. మీలో చాలా పాజిటివ్ వైబ్స్ ని నింపుతుంది. సెప్టెంబర్ 9న సినిమా విడుదలౌతుంది. తప్పకుండా చూడండి” అని అన్నారు.