Ram Charan: అదిరిపోయిన రామ్ చరణ్ నయా లుక్.. రాజసం ఉట్టిపడేలా ఉన్న చెర్రీ..
డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీలో కియారా అద్వానీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం ఆర్సీ 15 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో చెర్రీకి సంబంధించిన లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి. అందులో చరణ్ సరికొత్త లుక్లో కనిపించి షాకిచ్చాడు. బిజినెస్మెన్ లుక్లో.. సీరియస్.. రాజసం ఉట్టిపడేలా ఉన్నాడు చరణ్. హెలికాఫ్టర్ నుంచి చెర్రీ దిగివస్తున్న లుక్ ఆకట్టుకుంటుంది. అయితే ఈ లుక్ శంకర్ సినిమా కోసమా ? లేదా ? తెలియడం లేదు.
ఈ చిత్రం పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో చరణ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. గతంలోనూ ఈ మూవీ నుంచి చరణ్ లుక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత చరణ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఎన్నో అంచనాల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆర్సీ 15 చిత్రంలో శ్రీకాంత్, అంజలి, సముద్రఖని కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.