AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amritha Aiyer : ముద్దుగుమ్మ అమృతా అయ్యార్ పెళ్లి చేసుకుందా ?.. వైరలవుతున్న మ్యారేజ్ ఫోటోస్.. హీరోయిన్ రియాక్షన్ ఏంటంటే..

ఆకస్మాత్తుగా అమృతా అయ్యార్ పెళ్లి చేసుకోవడం ఏంటని నెట్టింట ఆందోళనకు గురయ్యారు. తాజాగా తన పెళ్లిపై వస్తున్న వార్తల పై స్పందించారు అమృత.

Amritha Aiyer : ముద్దుగుమ్మ అమృతా అయ్యార్ పెళ్లి చేసుకుందా ?.. వైరలవుతున్న మ్యారేజ్ ఫోటోస్.. హీరోయిన్ రియాక్షన్ ఏంటంటే..
Amritha
Rajitha Chanti
|

Updated on: Sep 04, 2022 | 6:58 AM

Share

తమిళ్ స్టార్ విజయ్ దళపతి.. డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన బిగిల్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ అమృతా అయ్యార్ (amritha aiyer). మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత యాంకర్ ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? సినిమాలో అమ్మాయిగారు పాత్రలో నటించి మెప్పించారు. ఇవే కాకుండా రెడ్, అర్జున ఫల్గుణ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె హనుమాన్ సినిమాలో నటిస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం హనుమాన్ సినిమా చిత్రీకరణలో ఉన్న అమృతా అయ్యా్ర్ పెళ్లి చేసుకుందని.. ఆమె పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆమె పెళ్లి ఫోటోస్ చూసి అభిమానులు షాకయ్యారు. ఆకస్మాత్తుగా అమృతా అయ్యార్ పెళ్లి చేసుకోవడం ఏంటని నెట్టింట ఆందోళనకు గురయ్యారు. తాజాగా తన పెళ్లిపై వస్తున్న వార్తల పై స్పందించారు అమృత.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన పెళ్లి వార్తలు అన్ని అవాస్తమని స్పష్టం చేశారు. రూమర్స్ రావడానికి కారణమైన ఫోటోలను షేర్ చేస్తూ.. అవి తాను గతంలో నటించిన వనక్కమ్ దా మప్పిలై అనే చిత్రంలోని స్టిల్స్ అని తెలిపారు. డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ తెరకెక్కిన ఈ తమిళ సినిమాలో అమృత తులసి అనే పాత్రలో నటించారు. ఇందులో ఓ సన్నివేశంలో ఆమె పెళ్లికూతురిగా కనిపించారు. ఆ ఫోటోలలో పక్కనే ఉన్న వరుడి ఫోటోను కట్ చేసి కేవలం అమృత ఫోటోలను మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆమె నిజంగానే పెళ్లి చేసుకుందా ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. తన పెళ్లి ఫోటోస్ చూసి తన సన్నిహితులు కూడా తనకు వివాహం జరిగిందా ?అని ప్రశ్నించడంతో షాకయ్యాను అంటూ చెప్పుకొచ్చింది అమృత. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు చిత్రాలున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.