Ranbir Kapoor: తెలుగులో మాట్లాడి అందరికి షాక్ ఇచ్చిన రణబీర్ కపూర్.. బ్ర‌హ్మాస్త్ర పార్ట్ 2 ఇంకా మాట్లాడుతా అంటూ..

బాలీవుడ్ లో రిలీజ్ అవుతోన్న బ్రహ్మాస్త్ర(Brahmāstra) సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు అక్కడి ప్రేక్షకులు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోన్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ranbir Kapoor: తెలుగులో మాట్లాడి అందరికి షాక్ ఇచ్చిన రణబీర్ కపూర్.. బ్ర‌హ్మాస్త్ర పార్ట్ 2 ఇంకా మాట్లాడుతా అంటూ..
Ranbir Kapoor
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 04, 2022 | 6:25 AM

బాలీవుడ్ లో రిలీజ్ అవుతోన్న బ్రహ్మాస్త్ర(Brahmāstra) సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు అక్కడి ప్రేక్షకులు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోన్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా.. అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో హీరో రణబీర్ కపూర్ మాట్లాడుతూ ఆందరిని ఆకట్టుకున్నారు.

‘‘నిజంగా ఈరోజు బ్ర‌హ్మాస్త్ర ఈవెంట్ ఘ‌నంగా జ‌ర‌గాల్సింది. కానీ జ‌ర‌గ‌లేక‌పోయింది. అందుకు ఎంతో బాధ‌గా ఉంది. రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈవెంట్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు. నేను కూడా ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఏదో కొత్తగా చేద్దామ‌ని, తార‌క్‌తో స్టేజ్‌తో మాట్లాడుదామ‌ని రెడీ అయ్యాను. నేను తెలుగు ప్రేక్ష‌కుల కోసం తెలుగు నేర్చుకున్నాను. అంటూ తెలుగులో మాట్లాడారు రణబీర్ ‘నాకెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్ బ్ర‌హ్మాస్త్ర‌. బిగ్గెస్ట్ ఈవెంట్ కూడా ఇదే. మంచి సినిమాను ఎంక‌రేజ్ చేయ‌డానికి తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ముందుంటారు. వారంద‌రికీ థాంక్స్‌. మా బ్ర‌హ్మాస్త్ర కూడా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని అనుకుంటున్నాను. ఈవెంట్‌కి వ‌చ్చిన అక్కినేని ఫ్యాన్స్‌, నంద‌మూరి ఫ్యాన్స్, రాజ‌మౌళిగారి ఫ్యాన్స్ అంద‌రికీ థాంక్స్‌. బ్ర‌హ్మాస్త్ర పార్ట్ 2 స‌మ‌యానికి తెలుగు ఇంకా బాగా నేర్చుకుని మాట్లాడుతాను’ అని తెలుగులో అన్నారు. ఇంకా మాట్లాడుతూ ‘నాగార్జునగారికి, తార‌క్‌ కి, రాజ‌మౌళిగారికి థాంక్స్‌. వారెంతో గొప్ప హృద‌యంతో మా సినిమాను ఎంక‌రేజ్ చేయ‌టానికి ఈవెంట్‌కు వ‌చ్చారు. త్రీడీలో కూడా బ్ర‌హ్మాస్త్ర రాబోతుంది’’ అని రణబీర్ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..