iBomma: తెలుగు సినీ ప్రియులకు ఐబొమ్మ మరో బిగ్ షాక్.. ఇకపై ఆ ఛాన్స్ లేనట్లే..

ఓటీటీల్లో సినిమాలు చూడలేనివారికి హై-క్వాలిటీ‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది iBomma వెబ్‌సైట్.

iBomma: తెలుగు సినీ ప్రియులకు ఐబొమ్మ మరో బిగ్ షాక్.. ఇకపై ఆ ఛాన్స్ లేనట్లే..
Ibomma
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Nov 14, 2022 | 5:13 PM

ఓటీటీల్లో సినిమాలు చూడలేనివారికి హై-క్వాలిటీ‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది iBomma వెబ్‌సైట్. చాలామంది నెటిజన్లు ఈ సైట్‌లోనే తమకు నచ్చిన సినిమాలు చూస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ అవకాశం ఉండదిక. తెలుగు సినీ ప్రియులకు iBomma వెబ్‌సైట్ మరో బ్యాడ్ న్యూస్ అందించింది. సినిమాల డౌన్‌లోడ్ ఆప్షన్‌ను శాశ్వతంగా నిలిపేసినట్లు ప్రకటించింది. నిన్నటి నుంచి ఈ వెబ్‌సైట్‌లో సినిమాల డౌన్‌లోడ్ కాకపోవడంతో గమనార్హం. వెబ్‌సైట్ నుంచి సినిమాల డౌన్‌లోడ్ శాశ్వతంగా నిలిపేశామని.. కేవలం ఆన్‌లైన్‌లో నచ్చిన సినిమాలు చూసుకోవచ్చునని iBomma టీం తెలిపింది. ఈ నిర్ణయంతో చాలామంది సినీ ప్రియులు నిరాశకు గురవుతున్నారని చెప్పొచ్చు. కాగా, గతంలో ఇండియన్ యూజర్లకు iBomma కేవలం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన చివరి 30 సినిమాలు మాత్రమే చూడవచ్చని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇదివరకు తమపై అనవసర దుష్ర్పచారం చేస్తున్నారని వెబ్‌సైట్‌ను షట్‌డౌన్‌ చేస్తున్నట్లు ఐబొమ్మ తెలిపింది. అయితే ఆ తర్వాత ఎందుకనో ఆ విషయంలో వెనక్కు తగ్గిన విషయం విదితమే.