Akshay Kumar: ‘ఒక్క హిట్టు కొట్టు బాసు’.. అక్షయ్ ఫ్యాన్స్ ఆశలు పై నీళ్లు
బాలీవుడ్ లో ఈ మధ్య గడ్డుకాలం నడుస్తోంది. ఇది అందరు అంటున్న మాట. గత కొంత కాలంగా బాలీవుడ్ లో సరైన హిట్ లేదు. చాలా కాలంగా వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ ఏది మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంలేదు.
బాలీవుడ్ లో ఈ మధ్య గడ్డుకాలం నడుస్తోంది. ఇది అందరు అంటున్న మాట. గత కొంత కాలంగా బాలీవుడ్ లో సరైన హిట్ లేదు. చాలా కాలంగా వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ ఏది మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంలేదు. చిన్న సినిమా దగ్గరా నుంచి పెద్ద సినిమా వరకు అన్ని ఫ్లాప్ లుగానే మిగులుతున్నాయి. ఈ క్రమంలో అక్షయ్ కుమార్(Akshay Kumar) నటిస్తున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. సంవత్సరానికి నాలుగు, ఐదు సినిమాలు చేసే హీరోల్లో అక్షయ్ ఒకరు. ఆయన నటించిన సినిమాలన్నీ అంతకు ముంది కనీసం యావరేజ్ గా ఆడేవి. కానీ ఈ మధ్య అక్షయ్ నటిస్తోన్న సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోతున్నాయి.
రీసెంట్ గా అక్షయ్ నటించిన సినిమాలనే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ చేసినా అదే పరిస్థితి. అయినా కూడా ఆగకుండా సినిమాలు చేస్తున్నాడు అక్షయ్. ఈ ఏడాదిలో బచ్చన్ పాండే మొదలుకుని సామ్రాట్ పృథ్వీరాజ్.. రక్షా బంధన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఇక ఇప్పుడు అక్షయ్ ఆశాలనీ కట్ పుట్లీ ని పైనే పెట్టుకున్నారు. తెలుగులో సూపర్ హిట్ గా నిలించిన రాక్షసుడు సినిమాలో రీమేక్ గా ఈ సినిమా వచ్చింది. ఈ మూవీ కూడా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా కూడా అక్షయ్ ఆశలపై నీళ్లు జల్లింది. ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూస్ రావడంతో ఈ సినిమాకూడా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో అక్షయ్ ఫ్యాన్స్ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఏడాది అక్షయ్ మరో రెండు సినిమాల్లో నటించే అవకాశం ఉంది. ఆ సినిమాలైనా హిట్ అవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ కోరికను అక్షయ్ తీరుస్తారేమో చూడాలి.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి