Viral Photo: సల్మాన్ ఖాన్‌తో టూత్‌పేస్ట్ యాడ్‌లో కనిపించిన ఈ బబ్లీ గర్ల్ ఎవరో గుర్తుపట్టరా ? .. వైరలవుతున్న ఓల్డ్ వీడియో..
సల్మాన్ ఖాన్‌తో ఒక బబ్లీ గర్ల్ చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రకటనలో కనిపించింది. ఇందులో ఉన్న ఆ బబ్లీ గర్స్ ఇప్పుడు ప్రజలు గుర్తించలేనంతగా మారిపోయింది.
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ఫోటోస్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో హీరోహీరోయిన్స్ నటించిన సినిమాలు.. యాడ్స్‌కు సంబంధించిన వీడియోస్ చక్కర్లు కొడుతున్నాయి. సినీ పరిశ్రమలోని చాలా మంది నటీనటులు కెరీర్ ఆరంభంలో ప్రకటనలలో నటించారు. యాడ్స్ చేసి ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు అందుకున్నవారు చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ హ్యండ్సమ్ సల్మాన్ ఖాన్ నటించిన పాత యాడ్ వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో, సల్మాన్ ఖాన్‌తో ఒక బబ్లీ గర్ల్ చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రకటనలో కనిపించింది. ఇందులో ఉన్న ఆ బబ్లీ గర్స్ ఇప్పుడు ప్రజలు గుర్తించలేనంతగా మారిపోయింది. ఈ ఎడిషన్‌లో ఈ బ్యూటీ చాలా సన్నగా, యంగ్ లుక్‌లో కనిపిస్తోంది. ఇందులో ఉన్న ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టరా ?
గుర్తుపట్టలేదు కదా.. ఆ బ్యూటీ పేరు అలీషా చినాయ్. ఆమె ఫేమస్ గాయని. బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక పాటలు పాడింది. ప్రస్తుతం ఆమె వయసు 57 సంవత్సరాలు. ఇప్పుడు ఆమె లుక్ పూర్తిగా మారిపోయింది. ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అలిషా.. ప్సస్తుతం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. తేరే ఇష్క్ మే నాచెంగే’, ‘దిల్ తు హి బాతా’, ‘జుబీ జూబీ’, ‘మేడ్ ఇన్ ఇండియా’, ‘కజ్రారే’, ‘కౌన్ హై వో’ పాడింది. ఇక మరోవైపు సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ సీజన్ 16 కు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. అలాగే.. ఆయన ప్రధాన పాత్రలో టైగర్ 3 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.