Anushka Shetty: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డ్రైవర్‌కు అనుష్క సాయం.. షోరూంకు తీసుకెళ్లి మరీ కారు కొనిచ్చిన స్వీటీ
నిశ్శబ్ధం తర్వాత సుమారు మూడేళ్లు గ్యాప్ తీసుకున్న అనుష్క ఇటీవల మిస్టర్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి సినిమాతో మనల్ని పలకరించింది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే ఇవాళ (నవంబర్ 7) అనుష్క పుట్టిన రోజు. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు స్వీటీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈనేపథ్యంలో అనుష్కతో అరుంధతి లాంటి బ్లాక్ బస్టర్

అనుష్కా శెట్టి.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సౌతిండియన్ సినిమా ఇండస్ట్రీలోనూ ఈ ముద్దుగుమ్మ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా గ్లామర్ రోల్స్‌తో అలరించిన ఈ మంగళూరు బ్యూటీ అరుంధతి సినిమాతో తనలోని అసలైన నటనా ప్రతిభను పరిచయం చేసింది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందీ సొగసరి. నిశ్శబ్ధం తర్వాత సుమారు మూడేళ్లు గ్యాప్ తీసుకున్న అనుష్క ఇటీవల మిస్టర్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి సినిమాతో మనల్ని పలకరించింది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే ఇవాళ (నవంబర్ 7) అనుష్క పుట్టిన రోజు. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు స్వీటీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈనేపథ్యంలో అనుష్కతో అరుంధతి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను నిర్మించిన నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్వీటి గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. అనుష్కతో పాటు ఆమె మనసు కూడా ఎంతో అందమైనదంటూ స్వీటీ చేసిన ఒక మంచి పనిని శ్యామ్ ప్రసాద్ రెడ్డి షేర్ చేసుకున్నారు.
‘కొన్నేళ్ల క్రితం అనుష్క ఒక తమిళ సినిమా షూటింగ్ కోసం జార్జియాకు వెళ్లింది. అక్కడ తనని షూట్ లొకేషన్ లో దింపడానికి జాజ అనే డ్రైవర్‌ను నియమించారు. అతను తక్కువ సమయంలోనే అనుష్కకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. స్వీటీ పట్ల ఎక్కువగా కేర్ తీసుకోవడం, షూటింగ్‌కు సమయానికి తీసుకెళ్లడం, తిరిగి జాగ్రత్తగా హోటల్ రూమ్ దగ్గర దింపేవాడు. అయితే ఒకరోజు సడెన్‌గా జాజ స్థానంలో వేరే డ్రైవర్ వచ్చాడు. విషయమేమిటంటే.. జాజ తన కార్‌కు ఇంట్రెస్ట్ కట్టలేక ఇబ్బంది పడుతున్నాడట. అందుకే షోరూం వాళ్లు వచ్చి జజా కార్ తీసుకొని వెళ్లి పోయారట. ఈ విషయం తెలుసుకున్న అనుష్క వెంటనే తన మేనేజర్ ద్వారా జాజ ను పిలిపించిందట. అతనితో పాటు షోరూంకు వెళ్లింది. అక్కడ జాజకు కొత్త కార్ ఇచ్చింది. ఈ విషయాన్ని స్వయానా ఆ డ్రైవరే నాతో చెప్పాడు’ అని శ్యామ్ ప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చారు.
తల్లి దండ్రులతో స్వీటీ..
View this post on Instagram
సోదరుడితో అనుష్క..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




