Rashmika Mandanna: రష్మిక మార్ఫింగ్ వీడియో నాదే.. జరిగిన దానికి చాలా చింతిస్తున్నా: జరా పటేల్
కేంద్ర ఐటీ శాఖ మంత్రులు, అమితాబ్ బచ్చన్, ఎమ్మెల్సీ కవిత, నాగచైతన్య, మృణాళ్ ఠాకూర్ తదితర ప్రముఖులు రష్మిక మార్ఫింగ్ వీడియోపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను శిక్షించాలని కోరుతున్నారు. మరోవైపు తన ఫేక్ వీడియోపై రష్మిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఈ క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఏఐ డీప్ ఫేక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ఈ చర్యను ఖండిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఐటీ శాఖ మంత్రులు, అమితాబ్ బచ్చన్, ఎమ్మెల్సీ కవిత, నాగచైతన్య, మృణాళ్ ఠాకూర్ తదితర ప్రముఖులు రష్మిక మార్ఫింగ్ వీడియోపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను శిక్షించాలని కోరుతున్నారు. మరోవైపు తన ఫేక్ వీడియోపై రష్మిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఈ క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. తాజాగా ఒరిజిల్ వీడియో క్లిప్‌లో ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జరా పటేల్ కూడా రష్మిక మార్ఫింగ్ వీడియోపై స్పందించింది. ఈ వీడియోకు తనకు ఎలాంటి సంబంధం లేదని, జరిగిన దానికి తాను చింతిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది.
అంతా నిజం కాదు..
ఏఐ డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీని ఉపయోగించి నా బాడీకి ఒక ప్రముఖ నటి (రష్మిక మందన్నా) ముఖాన్ని జోడించారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం నా దృష్టికి కూడా వచ్చింది. ఈ వీడియో మేకింగ్‌లో నా ప్రమేయం ఎంత మాత్రమూ లేదు. జరిగిన దానికి నేను చాలా చింతిస్తున్నాను. ఇలాంటి ఫేక్, మార్ఫింగ్ వీడియోలను చూస్తుంటే మహిళలు, చిన్నారుల భవిష్యత్‌పై ఆందోళనగా ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా షేర్ చేసుకోవాలన్న భయంగా ఉంటోంది. దయచేసి ఇలాంటి చర్యలను ఎవరూ ప్రోత్సహించవద్దు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి దాని విషయంలో నిజ నిర్ధారణ కూడా అవసరం. మనం ఇంటర్నెట్‌లో చూసేవన్నీ నిజం కాదు’ అని ఇన్ స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది జరా పటేల్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Zara Patel Post
జరా పటేల్ ఎవరంటే..
ఇక జరా పటేల్ ఒక బ్రిటిష్ ఇండియన్ మోడల్ అండ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సుమారు 4 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అలాగే డేటా ఇంజినీర్‌గా, మెంటల్ హెల్త్ అడ్వొకేట్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తన సోషల్ మీడియా బయోల్లో పేర్కొంది. కాగా తన ఫాలోవర్స్‌ను పెంచుకోవడానికి జరా ఎక్కువగా అడల్డ్ కంటెంట్‌ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఉంటుంది. అలా అక్టోబర్ 9వ తేదీన ఒక వీడియోను ఇన్ స్టా గ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియోనే కొందరు ఆకతాయిలు రష్మిక ఫేస్‌తో మార్ఫింగ్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..