Prabhas: ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. ఆసక్తికర అప్డేట్ ఇచ్చిన ప్రొడ్యూసర్..
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లోనూ డార్లింగ్ ఓ మూవీ చేయాల్సి ఉంది. వీరిద్దరి కాంబో ప్రాజెక్ట్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇందులో తొలిసారి యంగ్ రెబల్ స్టార్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రీకరణ కంప్లీట్ చేశాడు డార్లింగ్. ఇక ఇప్పుడు సలార్.. ప్రాజెక్ట్ కె చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మరోవైపు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాబోతున్న సినిమా చిత్రీకరణ కూడా సైలెంట్ గా కానిచ్చేస్తున్నాడు. అయితే ఇవే కాకుండా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లోనూ డార్లింగ్ ఓ మూవీ చేయాల్సి ఉంది. వీరిద్దరి కాంబో ప్రాజెక్ట్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇందులో తొలిసారి యంగ్ రెబల్ స్టార్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. దీంతో ఈ మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.
భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం డైరెక్టర్ సందీప్.. రణబీర్, రష్మిక జంటగా నటిస్తోన్న యానిమల్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ప్రభాస్ సినిమా స్పిరిట్ పనులు స్టార్ట్ చేయనున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. పోలీస్ డ్రామాగా రాబోతుంది. ఇందులో డార్లింగ్ తొలిసారి ఖాకీ దుస్తులు ధరించి..లాఠీ ఝళిపించనున్నారు. అలాగే.. ఈ సినిమాకు సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తుంది. ఈ విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఇప్పటివరకు ఫ్యాన్స్ చూడని ప్రభాస్ ను ఇందులో చూస్తారు” అంటూ చెప్పుకొచ్చారు.
ఇక నిర్మాత భూషణ్ కుమార్ కామెంట్స్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మొదటి సారి యంగ్ రెబల్ స్టార్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండడంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



