Prabhas: ‘సీతారామం’ డైరెక్టర్‏తో ప్రభాస్ లవ్ స్టోరీ సినిమా ?.. ఇక ఫ్యాన్స్‏కు పండగే..

డార్లింగ్ సినిమా తర్వాత ప్రభాస్.. పూజా హెగ్డే కాంబోలో వచ్చిన ప్రేమకథ రాధేశ్యామ్ సైతం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ నుంచి మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న ప్రభాస్.. ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.

Prabhas: 'సీతారామం' డైరెక్టర్‏తో ప్రభాస్ లవ్ స్టోరీ సినిమా ?.. ఇక ఫ్యాన్స్‏కు పండగే..
Prabhas, Hanu Raghavapudi
Follow us
Rajitha Chanti

|

Updated on: May 12, 2023 | 8:07 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు చిత్రాలున్నాయి. ఇప్పుడు డార్లింగ్ నటిస్తోన్న అన్ని చిత్రాలు భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా.. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె మినహా మిగతా అన్ని చిత్రాలు మాస్ యాక్షన్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బాహుబలి తర్వాత డార్లింగ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. డార్లింగ్ సినిమా తర్వాత ప్రభాస్.. పూజా హెగ్డే కాంబోలో వచ్చిన ప్రేమకథ రాధేశ్యామ్ సైతం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ నుంచి మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీ రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న ప్రభాస్.. ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.

గతేడాది సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ హను రాఘవపూడితో తాజాగా కథా పరమైన చర్చలు జరిపినట్లుగా ఫిల్మ్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. సీతారామం వంటి అందమైన ప్రేమకథ తర్వాత హను రాఘవపూడి ఓ పాన్ ఇండియా స్టార్ హీరోతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ముగ్గురు నలుగురు స్టార్లకు కథలను సిద్ధం చేశాడట. ఈ క్రమంలోనే ప్రభాస్ ను కలిసి.. ఓ ప్రేమకథ వినిపించాడని.. దానికి యంగ్ రెబల్ స్టార్ సైతం ఇంప్రెస్ అయ్యి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. రాధేశ్యామ్ తర్వాత వరసగా సీరియస్ సినిమాలే చేస్తోన్న ప్రభాస్.. ఇప్పుడు మరోసారి లవ్ స్టోరీ చేయడని అంత అనుకున్నారు. ఈ క్రమంలోనే సీతారామం సినిమాతో హిట్ అందుకున్న హనుతో ప్రభాస్ సినిమా వస్తుందనే న్యూస్ వినిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన అక్టోబర్లో రానుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ , ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచేసింది. ఇందులో కృతి సనన్ సీతగా.. ప్రభాస్ రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు.