Prabhas: ప్రభాస్ ఫేస్‏బుక్ అకౌంట్ హ్యాక్.. పోస్ట్ చేస్తూ క్లారిటీ ఇచ్చిన డార్లింగ్..

ప్రస్తుతం ఆయనను 24 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. కానీ డార్లింగ్ మాత్రం కేవలం డైరెక్టర్ రాజమౌళిని మాత్రమే ఫాలో అవుతున్నారు. కేవలం తన సినిమాలు విషయాలు.. నటీనటులకు విషెస్ చెప్పడానికి మాత్రమే సోషల్ మీడియాలో ఆ ఖాతాను ఉపయోగిస్తుంటారు.

Prabhas: ప్రభాస్ ఫేస్‏బుక్ అకౌంట్ హ్యాక్.. పోస్ట్ చేస్తూ క్లారిటీ ఇచ్చిన డార్లింగ్..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 28, 2023 | 7:46 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫేస్‏బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఇన్ స్టా స్టోరీ ద్వారా తెలియజేశాడు. గురువారం సాయంత్రం ఆయన ఖాతాలో ఓ వీడియో వైరలయ్యింది. అందులో మనుషులు దురదృష్టవంతులు అనే క్యాప్షన్‏తో ఉన్న వీడియో చూసిన ఫ్యాన్స్ ప్రభాస్ ఫేస్‏బుక్ అకౌంట్ హ్యాకయ్యింది అంటూ ట్వీట్ చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన టీమ్ సమస్యను పరిష్కరించింది. కొద్ది సమయం తర్వాత ప్రభాస్ ఫేస్‏బుక్ ఖాతాను తిరిగి పునరుద్దరించారు. దాదాపు 11 ఏళ్ల క్రితమే డార్లింగ్ ఫేస్‏బుక్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయనను 24 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. కానీ డార్లింగ్ మాత్రం కేవలం డైరెక్టర్ రాజమౌళిని మాత్రమే ఫాలో అవుతున్నారు. కేవలం తన సినిమాలు విషయాలు.. నటీనటులకు విషెస్ చెప్పడానికి మాత్రమే సోషల్ మీడియాలో ఆ ఖాతాను ఉపయోగిస్తుంటారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన నటించిన ఆదిపురుష్ చిత్రం తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్ని సలార్, ప్రాజెక్ట్ చిత్రాలపైనే ఉన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్ చిత్రం సెప్టెంబర్ 28న అడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Prabhas Facebook

Prabhas Facebook

అలాగే డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమా చేస్తున్నారు. అమిబాత్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ మూవీ టైటిల్ కల్కి 2898AD అని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ మూవీ ఏ రెంజ్ లో ఉంటుందో చెప్పేసింది. ఇవే కాకుండా మారుతి సినిమా పట్టాలపై ఉండగా.. త్వరలోనే సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా పట్టాలెక్కనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.