Baby Movie: బాక్సాఫీస్ వద్ద ‘బేబీ’ కలెక్షన్స్ విధ్వంసం.. ఏకంగా కేజీఎఫ్ 2 రికార్డ్ బ్రేక్ !..

ముఖ్యంగా ఈ ముగ్గురి అద్భుత నటనకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. పాజిటివ్ మౌత్‏టాక్‏తో థియేటర్లలో దూసుకుపోతుంది బేబీ సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ.70 కోట్ల మార్కును దాటేసింది. తాజాగా ఈ మూవీ మరో రికార్డ్ బ్రేక్ చేసినట్లుగా తెలుస్తోంది.

Baby Movie: బాక్సాఫీస్ వద్ద 'బేబీ' కలెక్షన్స్ విధ్వంసం.. ఏకంగా కేజీఎఫ్ 2 రికార్డ్ బ్రేక్ !..
Baby Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 28, 2023 | 6:56 AM

బేబీ.. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాకు అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీకి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఈ ముగ్గురి అద్భుత నటనకు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. పాజిటివ్ మౌత్‏టాక్‏తో థియేటర్లలో దూసుకుపోతుంది బేబీ సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ.70 కోట్ల మార్కును దాటేసింది. తాజాగా ఈ మూవీ మరో రికార్డ్ బ్రేక్ చేసినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోన్న ఈ సినిమా ఈసారి ఏకంగా కన్నడ స్టార్ యశ్ మూవీ కేజీఎఫ్ 2 రికార్డ్ బ్రేక్ చేసింది. గతంలో కేజీఎఫ్ 2 వరుసగా 12 రోజుల పాటు రోజుకు రూ.కోటి వసూళ్లు చేసింది. తాజాగా బేబీ చిత్రం వరుసగా 13 రోజులపాటు కోటికి పైగా కలెక్షన్స్ రాబట్టి కేజీఎఫ్ 2 రికార్డ్ బ్రేక్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా విడుదలై రెండు వారాలు గడుస్తున్నప్పటికీ రోజు రోజుకీ కలెక్షన్స్ భారీగానే వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి కలెక్షన్స్ దాటేసి మరో రికార్డ్ ఖాతాలో వేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఈ సూపర్ హిట్ మూవీని ఎస్కేఎన్ నిర్మించారు. చిన్న సినిమాగా వచ్చి.. ఇప్పుడు థియేటర్లలో సత్తా చాటుతోన్న ఈ చిత్రానికి మరిన్ని రోజులు భారీగానే కలెక్షన్స్ రానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.