Sai Dharam Tej: ‘బ్రో’ రిలీజ్.. అభిమానులకు సాయి ధరమ్ తేజ్ స్పెషల్ రిక్వెస్ట్.. ఆ విషయంలో జాగ్రత్త అంటూ..

మొదటిసారి మామ, మేనల్లుడు కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో బ్రో పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా ఈరోజు (జూలై 28న)అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు రెండు రోజుల ముందుగానే థియేటర్ల వద్ద సందడి స్టార్ట్ చేశారు.

Sai Dharam Tej: 'బ్రో' రిలీజ్.. అభిమానులకు సాయి ధరమ్ తేజ్ స్పెషల్ రిక్వెస్ట్.. ఆ విషయంలో జాగ్రత్త అంటూ..
Sai Dharam Tej, Pawan Kalya
Follow us
Rajitha Chanti

| Edited By: Basha Shek

Updated on: Aug 01, 2023 | 4:32 PM

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న చిత్రం బ్రో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధానపాత్రలలో నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే ఎంతో ఆసక్తి నెలకొంది. డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫాంటసీ మూవీలో మరోసారి దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మొదటిసారి మామ, మేనల్లుడు కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో బ్రో పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా ఈరోజు (జూలై 28న)అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు రెండు రోజుల ముందుగానే థియేటర్ల వద్ద సందడి స్టార్ట్ చేశారు.

తమ అభిమాన హీరోస్ కటౌట్స్ ఏర్పాట్లు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అదే సమయంలో బ్యానర్స్ గురించి ఫ్యాన్స్‏కు కొన్ని సూచనలు చేస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సాయి ధరమ్ తేజ్. “బ్యానర్స్ అండ్ భారీ కట్ అవుట్స్ ఏర్పాటు చేస్తూ మీరు మా పై చూపే అభిమానం మాకు అర్థవుతుంది. అందుకు ఎప్పుడు రుణపడి ఉంటాము. అయితే ఈ ప్రేమ చూపించే క్రమంలో జాగ్రత్త వహించండి. బ్యానర్స్ ఏర్పాటు చేసే ఉత్సాహంతో ప్రమాదానికి గురి అయితే అది మిమ్నల్ని ఎంతో బాధకు గురి చేస్తుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి” అంటూ పేర్కొన్నాడు తేజ్ .

ఇవి కూడా చదవండి

తమిళంలో వినోదయ సిత్తం సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు సముద్రఖని. అయితే ఇటీవల హీరో సూర్య బర్త్ డే సందర్భంగా ఏపీలో కొందరు యువకులు సూర్య బ్యానర్స్ ఏర్పాటు చేసే సమయంలో విద్యుధ్ఘాతానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మరణించగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యానర్స్ విషయంలో అభిమానులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.