Prabhas: బాక్సాఫీస్ కింగ్.. కేవలం 7 సినిమాలతో రూ.5300 కోట్లకు పైగా కలెక్షన్స్ .. ప్రభాస్ బర్త్ డే స్పెషల్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్. ఇక డార్లింగ్ సినిమా వచ్చిందంటే థియేటర్ల వద్ద జాతరే. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న డార్లింగ్.. మొదటి రోజే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ బ్రేక్ చేసే ఏకైక హీరో.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఆయన హీరో మాత్రమే కాదు.. ఆయనే ఒక పరిశ్రమ. పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్. ఆయన పేరుతో కొన్ని వేల కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగిపోతుంటాయి. తన సినిమా విడుదలైదంటే చాలు మొదటి రోజే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రావాల్సిందే. సినిమాలో కాదు.. నిజ జీవితంలోనూ ప్రభాస్ హీరోనే. ఆయన వ్యక్తిత్వానికి సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం ఫిదా అవుతుంటారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండడం ఆయనకు అలవాటే. పాన్ ఇండియా లెవల్లో ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసిన స్టార్ హీరో.. అయినా షూటింగ్ సెట్స్ లో చిన్నపిల్లాడే. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇటు సౌత్.. అటు నార్త్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఏకైక హీరో. తన కటౌట్ తో కోట్ల కలెక్షన్స్ రాబట్టే హీరో డార్లింగ్. సినీరంగంలో తనదైన ముద్ర వేసిన ప్రభాస్ పుట్టినరోజు నేడు (అక్టోబర్ 23). ఈ సందర్భంగా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రభాస్ త్రోబ్యాక్ ఫోటోస్, సినిమా అప్డేట్స్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?
దివంగత హీరో కృష్ణం రాజు నట వారసుడిగా సినీరంగంలోకి ఈశ్వర్ సినిమాతో అడుగుపెట్టాడు. కానీ ప్రభాస్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా వర్షం. ఈ మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాడు. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అదరగొట్టిన ప్రభాస్.. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించాడు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. సౌత్, నార్త్ ఇండస్ట్రీలలో బాహుబలి సినిమాతో రికార్డులు బ్రేక్ చేశారు. అంతేకాదు.. కేవలం తన 7 సినిమాలతో ఏకంగా రూ.5300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రభాస్ సినిమా అంటే.. మినిమం రూ.1000 కోట్లు దాటడం ఖాయం. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‌తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?
చిన్నప్పటి నుంచి ప్రభాస్ హీరో కావాలని అనుకోలేదట. కానీ తన ఫ్యామిలీ వేడుకలో అద్భుతంగా డ్యాన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారట. ఆ తర్వాత కొన్నాళ్లకు తాను సినిమాల్లోకి రావాలనుకుంటున్నట్లు కృష్ణంరాజుతో చెప్పడంతో వెంటనే .. ఆయనను సత్యానంద్ నటనా పాఠశాలలో చేర్పించారట. అక్కడ కొన్నాళ్లు శిక్షణ తీసుకున్న ప్రభాస్.. ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కానీ 2015లో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారారు. ఆ తర్వాత ప్రభాస్ కు తిరుగులేదు. ఇప్పుడు రాజాసాబ్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. అలాగే త్వరలోనే స్పిరిట్ మూవీ పట్టాలెక్కనుంది.
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..




