AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : టీచర్ కావాలనుకున్న అమ్మాయి.. కట్ చేస్తే.. స్పెషల్ పాటలతో రచ్చ.. 52 ఏళ్ల వయసులో గ్లామర్ అరాచకం..

సినీ గ్లామర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. ఒకప్పుడు అందం, అభినయంతో సిల్వర్ స్క్రీన్ పై మాయ చేసింది. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె వయసు 52 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందంతో.. నిత్యం గ్లామర్ ఫోటోషూట్లతో అరాచకం సృష్టిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Actress : టీచర్ కావాలనుకున్న అమ్మాయి.. కట్ చేస్తే.. స్పెషల్ పాటలతో రచ్చ.. 52 ఏళ్ల వయసులో గ్లామర్ అరాచకం..
Malaika Arora
Rajitha Chanti
|

Updated on: Oct 23, 2025 | 7:40 AM

Share

ఒకప్పుడు ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్ అంటే గుర్తొచ్చే మొదటి పేరు ఆమెదే. అందం, అభినయంతో వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసింది. హీరోయిన్ కాదు.. అయినా స్పెషల్ పాటలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో హీరోయిన్లకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది. కేవలం 3 నిమిషాల పాటకు అత్యధిక పారితోషికం తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఆమె వయసు 52 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తూ కుర్ర హీరోయిన్లకు షాకిస్తుంది. చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇటీవలే మరో స్పెషల్ పాటతో నెట్టింట రచ్చ చేసింది. ఈ వయసులోనూ ఏమాతం తగ్గని అందంతోపాటు.. కుర్ర హీరోయిన్లకు సైతం గుబులు పుట్టిస్తూ ప్రత్యేక పాటతో అదరగొట్టేసింది. కానీ మీకు తెలుసా.. ఆమె సినీరంగంలోకి రావాలనుకోలేదు. చిన్నప్పటి నుంచి టీచర్ కావాలనుకుంది. కానీ అనుహ్యంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు మాట్లాడుకుంటున్న హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ అందాల రాశి.. మలైకా అరోరా.

ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..

మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అందమైన స్టెప్పులతో.. గ్లామర్ లుక్స్ తో ఇప్పటికీ ఇండస్ట్రీలో ఆధిపత్యం చేలాయిస్తూనే ఉంది. ఈరోజు మలైకా 52వ పుట్టినరోజు. తన కెరీర్‌ను నిర్మించుకోవడానికి చాలా కష్టపడి పని చేసింది. మలైకా అరోరా అక్టోబర్ 23, 1973న ముంబైలో జన్మించారు. ఆమె తల్లి జాయిస్ పాలికార్ప్ మలయాళీ, తండ్రి పంజాబీ హిందూ కుటుంబానికి చెందినవారు. చిన్నప్పుడు తమ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఇబ్బందిపడిందని మలైకా చాలా సందర్భా్ల్లో పంచుకుంది. చిన్నప్పటి నుంచి టీచర్ కావాలనుకుంది. ఆ తర్వాత డ్యాన్స్ పై ఇష్టం పెంచుకున్న ఆమె.. నెమ్మదిగా సినీరంగం వైపు అడుగులు వేసింది. నాలుగేళ్ల వయస్సు నుండే బ్యాలెట్, జాజ్ బ్యాలెట్, భరతనాట్యంలో శిక్షణ పొందింది.

ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..

ఆమె తక్కువ సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ నటించిన దిల్ సే సినిమాలోని ‘చయ్యా చయ్యా’ పాటతో మలైకా ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. ఈ పాట అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికీ ఈ సాంగ్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత హిందీలో అనేక చిత్రాల్లో స్పెషల్ పాటలతో అదరగొట్టింది. ‘మున్నీ బద్నామ్ హుయ్’ (దబాంగ్), ‘కాల్ ధమాల్’ (కాల్), ‘ఆప్ జైసా కోయి’, ‘హే బేబీ’, ‘పాండే విజిల్’ వంటి హిట్ పాటలను అందించింది. ఇటీవల రష్మిక నటించిన పాయిజన్ బేబీ పాటతో మరోసారి సిల్వర్ స్క్రీన్ పై ఇరగదీసింది. సల్మాన్ ఖాన్ సోదరుడు ఆర్బాజ్ ఖాన్ తో విడాకుల తర్వాత కొన్నాళ్ల పాటు హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసిన మలైకా.. ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి : Actress : నాగార్జున, రజినీకాంత్‏తో సినిమాలు.. ఇప్పటికీ తగ్గని క్రేజ్.. ఈ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా..?

ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?