Ponniyin Selvan collection Day 3: మూడో రోజు పొన్నియిన్ సెల్వన్ వసూళ్ల వేట.. ఏకంగా రూ.300 కోట్ల దిశగా..

తెలుగు, తమిళంతోపాటు హిందీ, మలయాళం, కన్నడ భాషలలో విడుదలై సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది పొన్నియిన్ సెల్వన్.

Ponniyin Selvan collection Day 3: మూడో రోజు పొన్నియిన్ సెల్వన్ వసూళ్ల వేట.. ఏకంగా రూ.300 కోట్ల దిశగా..
Ponniyin Selvan
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 03, 2022 | 9:04 AM

డైరెక్టర్ మణిరత్నం చాలా కాలం తర్వాత పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన సినిమా పొన్నియిన్ సెల్వన్. భారీ తారాగణంతో రూపొందించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే ఈ సినిమాకు సూపర్ హిట్ రివ్యూ వచ్చేసింది. అంతేకాకుండా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎన్నో అంచనాలు మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 230 కోట్లను క్రాస్ చేసింది. అక్టోబర్ 3 నాటికి ఈ మూవీ రూ. 260 కోట్ల మార్క్ క్రాస్ చేసి.. రూ. 300 కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఇదే స్పీడులో కొనసాగితే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, పుష్ప చిత్రాల తర్వాత అత్యంత భారీ వసూళ్లు రాబట్టిన చిత్రంగా పొన్నియిన్ సెల్వన్ మూవీ నిలవనుంది.

ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ప్రకారం, పొన్నియిన్ సెల్వన్ థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతుంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.230 కోట్లకు పైగా వసూలు చేసింది. ” కేవలం మూడు రోజులలోనే #PS1 బాక్సాఫీస్ వద్ద రూ.230 కంటే ఎక్కువ వసూలు చేసింది.”

ఇవి కూడా చదవండి

తెలుగు, తమిళంతోపాటు హిందీ, మలయాళం, కన్నడ భాషలలో విడుదలై సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది పొన్నియిన్ సెల్వన్. ఇందులో ఐశ్వర్యరాయ్, చియాన్ విక్రమ్, జయం రవి, త్రిష, కార్తి, శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలలో నటించారు. రచయిత కల్కి రచించిన చోళ రాజవంశం.. వారి కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా పొన్నియిన్ సెల్వన్ నవల రచించారు. ఈ నవల పూర్తిగా 5 భాగాలుగు ఉండగా.. మొత్తం రెండు పార్టులలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు డైరెక్టర్ మణిరత్నం.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.