SS Rajamouli: మహేష్ సినిమాపై మరో అప్డేట్ ఇచ్చిన జక్కన్న.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలకు మించి..

నా హీరోస్, నా సినిమా.. నా మీద మీరంతా చూపిస్తున్న ప్రేమకు అపారమైనది. మీ ప్రేమకు ధన్యవాదాలు అమెరికా

SS Rajamouli: మహేష్ సినిమాపై మరో అప్డేట్ ఇచ్చిన జక్కన్న.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలకు మించి..
Rajamouli, Mahesh Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 02, 2022 | 5:36 PM

బాహుబలితో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు డైరెక్టర్ రాజమౌళి. నార్త్ మాత్రమే కాకుండా హాలీవుడ్ డైరెక్టర్స్ సైతం తెలుగు సినిమాలను ఏరికోరి చూసేలా మార్చేశారు. బాహుబలి సిరీస్‎తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన జక్కన్న.. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచాన్ని ఫిదా చేశారు. ఈ సినిమా చూసేందుకు విదేశాల్లో కూడా ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. రాజమౌళి దర్శకత్వంకు.. ఆయన సినిమా రూపొందించే విధానానికి ప్రేక్షకులే కాదు.. సినీ క్రిటిక్స్ సైతం ముగ్దులయ్యారు. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని లాస్ ఏంజిల్స్‏లో బియాండ్ ఫెస్ట్‏లో ప్రదర్శించారు. అనంతరం రాజమౌళితో మాట్లాడేందుకు నిర్వహించి సెషన్ కోసం భారీగా అభిమానులు తరలివచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు జక్కన్న.

లాస్ ఏంజిల్స్ లోని చైనీస్ థియేటర్లో ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రదర్శనకు ముందే టికెట్స్ భారీగా అమ్ముడయ్యాయి. అంతేకాకుండా నాటు నాటు పాటకు అభిమానులు స్ర్కీ్న్ ముందు డాన్స్ చేసిన వీడియోస్ నెట్టింట వైరలయ్యాయి. వాటిని షేర్ చేస్తూ.. ” నా హీరోస్, నా సినిమా.. నా మీద మీరంతా చూపిస్తున్న ప్రేమకు అపారమైనది. మీ ప్రేమకు ధన్యవాదాలు అమెరికా ” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు వస్తున్న ఆడియన్స్ రెస్పాన్స్ ముందు అవార్డు కూడా తక్కువే అన్నారు వేరియెన్స్ ఫిలిమ్స్ ప్రెసిడెంట్ డైలాన్ మార్చెట్టి.

ఇక అమెరికాలో వస్తున్న రెస్పాన్స్ ఆస్వాదిస్తూనే.. తన తదుపరి సినిమా గురించి స్పందించారు జక్కన్న. తాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయబోయే సినిమా తన కెరీర్ లో ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాల్లో కంటే అతి పెద్ద మూవీగా ఉండబోతుందని.. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కనుందని తెలిపారు. బాహుబలి ఆ తర్వాత ఆర్ఆర్ఆర్.. ఇలా ఆయా సందర్భాల్లో అత్యధిక వ్యయంతో రూపొందిన సినిమాలివి. తదుపరి సినిమా మరింత భారీ స్థాయిలో ఉంటుందని అన్నారు. దీంతో మహేష్, రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే