AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: ‘సురేఖ కాఫీకే పడిపోయాను.. కళ్లు తెరిచి చూసేసరికి పెళ్లి అయిపోయింది’.. మెగాస్టార్ పెళ్లిలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా ?..

అల్లు రామలింగయ్యగారితో నాకు ఉన్న అనుబంధం ఇంకెవరితోను లేదు. ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. అల్లు రామలింగయ్య గారిని మొదటి సారి చూసిన సమయంలోనే ఆయన తీరును చూసి ఆశ్చర్యపోయాను.

Megastar Chiranjeevi: 'సురేఖ కాఫీకే పడిపోయాను.. కళ్లు తెరిచి చూసేసరికి పెళ్లి అయిపోయింది'.. మెగాస్టార్ పెళ్లిలో ఇన్ని ట్విస్టులు ఉన్నాయా ?..
Megastar Chiranjeevi, Surek
Rajitha Chanti
|

Updated on: Oct 02, 2022 | 6:09 PM

Share

దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు అల్లు కుటుంబం. శనివారం ఉదయం అల్లు స్టూడియోస్‏ను ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి. అనంతరం అదే రోజు రాత్రి నిర్వహించిన వేడుకలకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన, చిరంజీవి సతీమణి సురేఖ (అల్లు రామలింగయ్య కుమార్తె), అలాగే అల్లు అరవింద్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ, సాయి ధరమ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు. అల్లు రామలింగయ్యపై రాసిన పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించి, తొలి ప్రతిని మెగాస్టార్ చిరంజీవికి అందించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అలాగే ఆయన కుమార్తె సురేఖతో తన వివాహం ఎలా జరిగిందో చెబుతూ ఆనాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ… ” అల్లు రామలింగయ్యగారితో నాకు ఉన్న అనుబంధం ఇంకెవరితోను లేదు. ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. అల్లు రామలింగయ్య గారిని మొదటి సారి చూసిన సమయంలోనే ఆయన తీరును చూసి ఆశ్చర్యపోయాను. షూటింగ్ సమయంలో చాలా మంది ఉండగా ఆయన నా వైపే పదే పదే చూస్తూ నన్ను గమనించడం చేసేవారు. ఆ సమయంలో నాకు ఆయన ఎందుకు అలా చూస్తున్నారో అర్థం కాలేదు కానీ ఆ తర్వాత అర్థమైంది.అల్లు రామలింగయ్య గారు ఒకసారి షూటింగ్ పూర్తి చేసుకొని రైల్లో వెళుతున్న గా పక్కన కూర్చోబెట్టుకొని మందు తాగుతావా అంటూ నన్ను అడిగాడు. అప్పటికి నాకు అలవాటు లేదండి అని హనుమాన్ భక్తున్ని అంటూ అక్కడి నుంచి వెళ్లాను. అలా నా గురించి పలుసార్లు ఆయనకు పాజిటివ్ గా అనిపించింది.ఆ తర్వాత నా వద్ద నిర్మాత వచ్చి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు. నేను మాత్రం కెరియర్ లో ఇప్పుడే నిలదొక్కుకుంటున్నాను.. కనుక ఇప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పేశాను.. అయినా కూడా వినకుండా మెల్లగా మా నాన్నగారి దగ్గరికి వెళ్లి ఇండస్ట్రీలో చిరంజీవి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు, అమ్మాయిలు చాలామంది ఆయన్ని లాక్కొని ప్రయత్నం చేస్తారు.కనుక ఇప్పుడే పెళ్లి చేస్తే బాగుంటుంది అన్నట్లుగా మా నాన్న గారితో చెప్పడంతో మా నాన్నగారు నన్ను ఒప్పించారు.

ఇష్టం లేకుండానే అల్లు రామలింగయ్య గారింటికి పెళ్లి చూపులకు వెళ్ళాము. అక్కడ సురేఖని చూసిన తర్వాత నో చెప్పలేకపోయాను. ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్నాను, ముందు ముందు మరింత భవిష్యత్తు ఉంటుంది. పెళ్లికి ఎస్ చెప్పాలా నో చెప్పాలా అని సంశయిస్తూ ఉండగా సురేఖని చూసి నో చెప్పలేకపోయాను. ఆ తర్వాత మరోసారి వాళ్ల ఇంటికి రమన్ని అల్లు రామలింగయ్యగారు పిలిచారు. వెళ్లాను. అప్పుడే సురేఖ స్వయంగా కాఫీ పెట్టి తీసుకువచ్చి ఇచ్చింది. అందులో ఏం కలిపిందో తెలియదు కానీ. పెళ్లి ఓకే చెప్పాను, కళ్లు తెరిచి చూసేసరికి పెళ్లయింది” అంటూ సరదాగా అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అల్లు రామలింగయ్య గారిని ఆయనొక నిరంతర విద్యార్థి , చిరస్మరణీయుడు ఆయన మరణించలేదు మన మద్యే ఉన్నరని కొనియాడారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.