Adipurush: అయోధ్యలో ల్యాండ్ అయిన ఆదిపురుష్.. స్టన్నింగ్ లుక్‏లో ప్రభాస్.. నెట్టింట ఫోటోస్ వైరల్..

బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు.

Adipurush: అయోధ్యలో ల్యాండ్ అయిన ఆదిపురుష్.. స్టన్నింగ్ లుక్‏లో ప్రభాస్.. నెట్టింట ఫోటోస్ వైరల్..
Prabhas, Adipurush
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 02, 2022 | 5:35 PM

గత కొద్ది రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న రెబల్ స్టార్ అభిమానుల కల మరికొద్ది గంటల్లో నెరవేరబోతుంది. వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఆదిపురుష్ టీజర్ అక్టోబర్ 2న అయోధ్యలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే అయోధ్యలో ఈరోజు సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. దాదాపు 1.40 నిమిషాల పాటు సాగే ఈ టీజర్ పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి సారి రాముడిగా టాలీవుడ్ బాహుబలుడు ప్రభాస్ కనిపించనుండడంతో.. సినిమా కోసం ఆత్రంగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ టీజర్ లాంచ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే తాజాగా డార్లింగ్ ప్రభాస్ అయోధ్యకు చేరుకున్నాడు. ఎయిర్ పోర్టులో ప్రభాస్ నడుస్తున్న ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో బ్లాక్ టీషర్టులో క్యాజువల్ లుక్‏లో ఫోన్ చూస్తూ వెళ్తున్నారు. దీంతో అయోధ్యకు చేరిన ఆదిపురుష్ అంటూ ట్విట్టర్ వేదికగా రచ్చ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అప్డేట్స్ కోసం నెట్టింట ఫ్యాన్స్ మొరపెట్టుకున్నా మేకర్స్ మాత్రం కనికరించలేదు. ఇక ఇటీవల విడుదలైన ఆదిపురుష్ పోస్టర్‏కు రెస్పాన్స్ అదిరిపోయింది. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Prabhas

Prabhas

రామాయణ పౌరాణిక కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని తెలుగుతోపాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలోనే కాకుండా అంతర్జాతీయ భాషలలో సైతం విడుదల కానుంది. ఇప్పటివరకు కేవలం టీజర్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూసిన ధాఖలాలు లేవు. అంతేకాకుండా అటు అయోధ్యలోనూ ఎలాంటి సినిమా ఫంక్షన్స్ జరగలేదు. మొట్ట మొదటి సారి ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ మాత్రమే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బందోబస్తు మధ్య విడుదల చేయబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తిచేశారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే