Rashmika Mandanna: పుష్ప సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన రష్మిక.. ఏమన్నదంటే..

నా ఫస్ట్ మూవీ కిరిక్ పార్టీ, ఇది నా తొలి కన్నడ చిత్రం, ఆ తర్వాత తెలుగులో గీత గోవిందం.. నటిగా నన్ను అందరికీ పరిచయం చేసిన సినిమా ఇది. ఆ తర్వాత పుష్ప.

Rashmika Mandanna: పుష్ప సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసిన రష్మిక.. ఏమన్నదంటే..
Rashmika Mandanna
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 02, 2022 | 4:31 PM

కిరిక్ పార్టీ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన రష్మిక.. అతి తక్కువ సమయంలోనే దక్షిణాదిలో అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మకు డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ అతి పెద్ద విజయం సాధించింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అల్లు అర్జున్, రష్మికకు నార్త్‏లో క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ఇటు దక్షిణాదిలోనే కాకుండా హిందీలోనూ వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది నేషనల్ క్రష్. ఇప్పటికే ఆమె చేతిలో మూడు బాలీవుడ్ చిత్రాలున్నాయి. అందులో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్ బై చిత్రంలో నటించగా.. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిస్టర్ మజ్ను, రణబీర్ కపూర్ కు జోడీగా యానిమల్ సినిమాలో నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న గుడ్ బై సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గోంటున్న రష్మిక.. తాజాగా తన కెరీర్ మార్చిన సినిమాలను గుర్తు చేసుకుంది. బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ.. “నా ఫస్ట్ మూవీ కిరిక్ పార్టీ, ఇది నా తొలి కన్నడ చిత్రం, ఆ తర్వాత తెలుగులో గీత గోవిందం.. నటిగా నన్ను అందరికీ పరిచయం చేసిన సినిమా ఇది. ఆ తర్వాత పుష్ప. ఈ మూవీ దేశవ్యాప్తంగా నటిగా నాపై ఉన్న అభిప్రాయాన్ని మార్చింది. నేను ఎప్పటికీ పూర్తిగా నటిని కాదు.. ఎందుకంటే నేను ఇంకా నన్ను నేను అన్వేషించుకునే దశలో ఉన్నాను. పుష్ప మంచి సినిమా అని ముందే అనుకున్నాం. కానీ ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ మాత్రం ఊహించలేదు. కంటెంట్ బాగుందనుకున్నాం. కానీ ఫలితం చూసి ఆశ్చర్యపోయాము” అంటూ చెప్పుకొచ్చింది.

త్వరలోనే పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ లో రష్మిక పాల్గోననుంది. ఇక ఏక్తా కపూర్ నిర్మించిన గుడ్ బై చిత్రం అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఇవే కాకుండా తమిళంలో విజయ్ దళపతి సరసన వరిసు సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే