AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR 30: ఎన్టీఆర్‌, కొరటాల శివ చిత్రంపై మరో రూమర్‌.. మళ్లీ మారిన హీరోయిన్‌ పేరు.. ఒకరు కాదు ఇద్దరంటా..

ట్రిపులార్‌ లాంటి భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణలతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు...

NTR 30: ఎన్టీఆర్‌, కొరటాల శివ చిత్రంపై మరో రూమర్‌.. మళ్లీ మారిన హీరోయిన్‌ పేరు.. ఒకరు కాదు ఇద్దరంటా..
Ntr 30 Movie
Narender Vaitla
|

Updated on: Oct 02, 2022 | 4:31 PM

Share

ట్రిపులార్‌ లాంటి భారీ విజయాన్ని అందుకున్న తర్వాత ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణలతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన కసరత్తులు తాజాగా మొదలయ్యాయి. మాస్‌ యాక్షన్‌గా రానున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు కేవలం ఒక పోస్టర్‌ తప్ప ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. దీంతో తారక్‌ ఫ్యాన్స్‌ వేయి కళ్లతో సినిమా అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇక ఎన్టీఆర్‌ 30 వర్కింగ్‌ టైటిల్‌తో ప్రచారం చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనే విషయం మిస్టరీగా మారింది. ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించినా చిత్ర యూనిట్‌ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలనాటి అందాల తార జాహ్నవి కపూర్‌ ఈ సినిమాలో నటించనుందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఎలాంటి అధాకారిక ప్రకటన రాలేదు. అనంతరం మృణాల్‌ ఠాకూర్‌ ఎన్టీఆర్‌కు జోడిగా నటించనుందని వార్తలు వచ్చాయి.. అయితే దీనిపై కూడా చిత్ర యూనిట్‌ స్పందించలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా హీరోయిన్‌కు సంబంధించి మరో వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది.

తాజాగా ట్రెండ్‌ అవుతోన్న న్యూస్‌ ప్రకారం.. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని సమాచారం. వీరిలో ఒకరు రష్మిక కాగా, మరొకరు కీర్తీ సురేషన్‌ అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే యంగ్‌ టైగర్‌ ఇప్పటి వరకు వీరిద్దరితో నటించలేదనే విషయం తెలిసిందే. మరి తాజాగా వైరల్‌ అవుతోన్న ఈ వార్తలో అయినా నిజం ఉందా.. లేదా ఇది కూడా పుకారు వార్తేనా అనే విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఎన్‌టీఆర్‌ ఆర్స్ట్, యువసుధ ఆర్స్ట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రక్తం పట్టడానికి తినాల్సిన అమ్మమ్మలకాలంనాటి బియ్యం పిండి అప్పాలు
రక్తం పట్టడానికి తినాల్సిన అమ్మమ్మలకాలంనాటి బియ్యం పిండి అప్పాలు
ఖడ్గంసినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!
ఖడ్గంసినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!
ఏంది.. నెయ్యి తింటే బరువు తగ్గుతారా.. జస్ట్ ఉదయాన్నే ఇలా చేస్తే..
ఏంది.. నెయ్యి తింటే బరువు తగ్గుతారా.. జస్ట్ ఉదయాన్నే ఇలా చేస్తే..
కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం..
కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం..
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే
ఇంగ్లాండ్‌ వన్డే సిరీస్‌కు టీమిండియా 'ఖతర్నాక్' ప్లేయింగ్ 11 ఇదే
ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తినాల్సిన స్పాంజి లాంటి పుల్లట్లు
ఉద్యోగం చేసే ఆడవాళ్ళు తినాల్సిన స్పాంజి లాంటి పుల్లట్లు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు.. UPSCలో ఉద్యోగ అవకాశాలు
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు.. UPSCలో ఉద్యోగ అవకాశాలు
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. ఈ యాప్ ద్వారానే..
యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విత్ డ్రా.. ఈ యాప్ ద్వారానే..
అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండా ముగ్గురు మృతి
అర్థరాత్రి వెంటాడిన మృత్యువు.. ఇంటికి చేరకుండా ముగ్గురు మృతి
ప్రాణాలు తీస్తున్న ఫోన్లు.. ప్రణవి విషయంలో ఏం జరిగింది?
ప్రాణాలు తీస్తున్న ఫోన్లు.. ప్రణవి విషయంలో ఏం జరిగింది?