OTT Movies: దసరా రోజు మరింత వినోదం.. ఒక్కరోజే ఓటీటీలోకి రెండు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు..
మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు ఎదుర్కొంటూ తన ఉనికి ఎలా చాటుకుందనేది ఈ చిత్రం.
దసరాకు సినీ ప్రియులకు మరింత వినోదం అందించేందుకు సిద్ధమయ్యాయి భారీ బడ్జెట్ చిత్రాలు. అటు ఓటీటీల్లోనూ.. ఇటు థియేటర్లలోనూ చిన్న సినిమాలే కాదు.. స్టార్ హీరోస్ మూవీస్ సైతం సందడి చేయనున్నారు. ఇప్పటికే అక్టోబర్ 5న మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, కింగ్ నాగార్జున ది ఘోస్ట్ చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అలాగే ఓటీటీలోనూ పలు సూపర్ హిట్ మూవీస్, వెబ్ సిరీస్ అలరించనున్నాయి. ఇక ఇప్పుడు మరో రెండు చిత్రాలు తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో స్ట్రీమింగ్ కానున్నాయి. నాటకం ఫేమ్ ఆశిష్ గాంధీ, రంగుల రాట్నం ఫేమ్ చిత్ర శుక్ల కాంబోలో వచ్చిన లేటేస్ట్ చిత్రం ఉనికి. ఈ సినిమాకు రాజ్ కుమార్ బాబీ దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. అక్టోబర్ 5న ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు ఎదుర్కొంటూ తన ఉనికి ఎలా చాటుకుందనేది ఈ చిత్రం. రాజమండ్రి సబ్ కలెక్టర్ అంజలి అనుపమ స్పూర్తితో ఈ మూవీని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ఇప్పుడు తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో అక్టోబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అలాగే యాంకర్ అనసూయ, సునీల్ ప్రధాన పాత్రలలో నటించిన దర్జా చిత్రం కూడా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. ఆమని, పృథ్వీ, ఆక్సాఖాన్ కీలకపాత్రలలో నటించగా.. శివశంకర్ పైడిపాటి నిర్మించారు. జూలై 22న విడుదలైన ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ చిత్రంలో ఆహాలో అక్టోబర్ 5న స్ట్రీమింగ్ కానుంది.