Adipurush: అయోధ్యలో ఆదిపురుషుడు…! 7 ఎప్పుడు అవుతుందిరా అయ్యా..? డార్లింగ్ ఫ్యాన్స్ సిట్యువేషన్ ఇది

ఆది పురుష్ మెగా టీజర్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. రాముడిగా ప్రభాస్ ఎలా ఉన్నాడో చూడాలని వారు ఆరాటపడుతున్నారు. ప్రజంట్ సోషల్ మీడియాలో ఈ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

Adipurush: అయోధ్యలో ఆదిపురుషుడు...! 7 ఎప్పుడు అవుతుందిరా అయ్యా..? డార్లింగ్ ఫ్యాన్స్ సిట్యువేషన్ ఇది
Adipurush Prabhas
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 02, 2022 | 3:23 PM

అయోధ్యలో ఆదిపురుషుడు…! ఎస్… ఆదిపురుషుడి తాజా కేరాఫ్ అయోధ్య. టాలీవుడ్ బాహుబలుడు ఆదిపురుషుడి అవతారంలో అయోధ్యలో ఫస్ట్‌ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడు. ది పర్‌ఫెక్ట్‌ పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్‌కి సంబంధించిన టీజర్ లాంచ్… రామజన్మభూమి అయోధ్యలో జరగబోతోంది. ఆ సుముహూర్తం… ఇవాళ సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు. డార్లింగ్ ఫ్యాన్స్‌కి ఇదొక క్రూషియల్ మూమెంట్. ఈ వేడుకను ఎక్స్‌క్లూజివ్‌గా ప్రత్యక్షప్రసారం చేస్తోంది టీవీ9.

డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న మొట్టమొదటి మైథలాజికల్ ఫ్లేవరున్న మూవీ ఆదిపురుష్. నేషనల్ అవార్డ్ విన్నర్, తానాజీ లాంటి ఎపిక్స్‌ తీసిన ఓం రౌత్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ గెటప్ రిలీజై… అభిమానుల్ని మెస్మరైజ్ చేస్తోంది. అభిరాముడిగా ప్రభాస్ గెటప్ అదుర్స్‌ అని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ఇందులో సీతగా క్రితి సనన్ నటిస్తున్నారు.

ఇప్పటివరకు అయోధ్యలో సినిమా ఫంక్షన్లు జరిగిన దాఖలా లేనేలేదు. ఆ విధంగా రికార్డ్ క్రియేట్ చెయ్యబోతోంది ప్రభాస్ ఆదిపురుష్. హిందీ సహా మొత్తం ఐదు భాషల్లో రూపొందుతున్న ఆదిపురుష్ మూవీ… వచ్చే సంక్రాంతి సీజన్‌లో జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజౌతోంది. బాహుబలితో నార్త్‌ ఆడియన్స్‌కి గ్రాండ్‌గా పరిచయమైన ప్రభాస్… ఆదిపురుష్‌తో తన స్టామినాను మరోసారి ప్రూవ్ చేసుకోబోతున్నారు. ఆదిపురుష్ ప్రమోషన్స్‌ని అట్టహాసంగా ప్రారంభిస్తూ… ఇవాళ అయోధ్యలో టీజర్ లాంచ్ చెయ్యబోతున్నారు. సాయంత్రం ఏడుంబావుకి జరిగే ఈ కార్యక్రమం కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవెంట్‌ని టీవీ9లో ఎక్స్‌క్లూజివ్‌గా చూడొచ్చు.

టీజర్ గురించి క్రేజీ మీమ్స్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..