AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal thakur: వాటి వెంట పరిగెడుతూనే ఉండాలట.. లేదంటే జీవితం వ్యర్థమంటోన్న సీతారామమ్‌ బ్యూటీ..

సీతా రామమ్‌ సినిమా విడుదల తర్వాత మృణాల్‌కు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ పోస్ట్‌ చేస్తున్న ఫొటోలు కుర్రకారును ఫిదా చేస్తున్నాయి. సీత పాత్రలో సంప్రదాయంగా కనిపించిన మృణాల్‌...

Mrunal thakur: వాటి వెంట పరిగెడుతూనే ఉండాలట.. లేదంటే జీవితం వ్యర్థమంటోన్న సీతారామమ్‌ బ్యూటీ..
Mrunal Thakur
Narender Vaitla
|

Updated on: Oct 02, 2022 | 3:15 PM

Share

ఒకే ఒక్క సినిమాతో ఎక్కడలేని క్రేజ్‌ను సంపాదించుకుంది అందాల తార మృణాల్‌ ఠాకూర్‌. సీతారామమ్‌ సినిమాలో సీతా పాత్రలో మెస్మరైజ్‌ చేసిన ఈ బ్యూటీ ఒక్కసారిగా సౌత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకుంది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా సక్సెల్‌లో కీలకపాత్ర పోషించింది. దీంతో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఈ అమ్మడుకి భారీగానే అవకాశాలు క్యూ కడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే సీతా రామమ్‌ సినిమా విడుదల తర్వాత మృణాల్‌కు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ పోస్ట్‌ చేస్తున్న ఫొటోలు కుర్రకారును ఫిదా చేస్తున్నాయి. సీత పాత్రలో సంప్రదాయంగా కనిపించిన మృణాల్‌ ఇటీవల పలు హాట్‌ హాట్‌ ఫొటోషూట్స్‌తో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చి ఓ ఇంటర్వ్యూలో ఈ అమ్మడు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన ఇష్టాల గురించి వివరించిన ఈ బ్యూటీ.. తనకు ఆటలు అంటే చాలా ఇష్టమని తెలిపింది. క్రికెట్, బాస్కెట్‌ బాల్‌ ఆడే అలవాటున్న మృణాల్‌.. జోనల్‌ మ్యాచ్‌లో కూడా తన సత్తా చాటిందని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇక తనకు చిన్నప్పుడు ఇద్దరిపై క్రష్‌ ఉండేదని చెప్పుకొచ్చిన మృణాల్‌.. హృతిక్‌రోషన్‌, షాహిద్‌కపూర్‌ ఫొటోల్ని చించి పుస్తకాల్లో పెట్టుకుని చూసుకునేదాన్నని, వాళ్లతో కలిసి నటించే అవకాశం వచ్చినప్పుడు ఎగిరిగంతేశాని మనసులో మాట బయటపెట్టింది. ఇక చూడ చక్కని రూపంతో ఉండే మృణాల్‌ సిద్ధాంతం కూడా అంతే అందంగా ఉంది. కలలు లేని జీవితం వ్యర్థమని నమ్మే ఈ అందాల రాశి.. ఆ స్వప్నాల వెంట నిత్యం పరుగులు తీస్తూనే ఉండాలని చెప్పుకొచ్చింది. ఇలా కేవలం అందంతోనే కాకుండా తనదైన సిద్ధాంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుందీ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి…