Ponniyin selvan: పొన్నియిన్ సెల్వన్ వసూళ్ల సునామి.. ఏకంగా అక్కడే రూ. 100 కోట్లకుపైగా..
చాలా రోజుల తర్వాత మణిరత్నం ఈ సినిమాతో ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందించారు. తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల నేపథ్యంలో తెరకెక్కిన పొన్నియిన్ ప్రస్తుతం బాక్సాఫీస్ ముందు వసూళ్ల సునామి సృష్టిస్తోంది...
దిగ్గజ దర్శకుడు మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ సినిమా తొలి పార్ట్ సెప్టెంబర్ 30న విడుదలై విజయవంతంగా నడుస్తోంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులకు బ్రహ్మరథం పడుతున్నారు. చాలా రోజుల తర్వాత మణిరత్నం ఈ సినిమాతో ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందించారు. తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ ముందు వసూళ్ల సునామి సృష్టిస్తోంది.
మరీ ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమాకు విపరీత క్రేజ్ లభిస్తోంది. ఒక్క తమిళనాడులోనే ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడానికి సిద్ధమైందీ చిత్రం. ఇక మిగతా భాషల్లోనూ సినిమాకు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ. 147 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది.
తమిళ్‌తో పాటు ఓవర్సీస్‌లో కూడా సినిమాకు మంచి టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ చాలా సులభంగా సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో అదే స్థాయిలో నటీనటులు ఉన్నారు. చియాన్ విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, కీలక పాత్రల్లో నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..