Bigg Boss 6 Telugu: నాగార్జున ఉగ్రరూపం.. మాట్లాడుతుంటే మధ్యలోకి రావద్దంటూ ఫైర్.. కన్నీళ్లు పెట్టుకున్న గీతూ..
కీర్తితో నాగార్జున మాట్లాడుతున్న సమయంలో మధ్యలో ఇన్వాల్వ్ అయ్యింది గీతూ. దీంతో ఆమె పై నాగార్జున ఫైర్ అయ్యారు.
సండే ఫన్ డే అంటూ సందడి చేసేందుకు ఆదివారం వచ్చేశారు నాగార్జున్. బిగ్ బాస్ వేదికగా దసరా స్పెషల్ ఎపిసోడ్ నిర్వహించారు. అంతేకాదు.. డ్యాన్స్.. ఆటలు అంటూ హౌస్‌మేట్స్‌ను అలరించారు కింగ్ నాగ్. నాలుగో వారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా రసవత్తరంగా సాగింది. ముందుగా పండగా ఎపిసోడ్ కాబట్టి.. ఒకరిని సేవ్ చేసి ఆట ప్రారంభిద్దామని చెప్పారు నాగ్. అనంతరం ఇంట్లో ఉన్న సభ్యుల చేత టెంకాయలు కొట్టించారు. అందులో ఒక చీటి ఉంచి.. సేఫ్.. అన్ సేఫ్ అని రాశాను. ఇందులో ముందు శ్రీహాన్ సేఫ్ అయ్యాడు. మనసులో ఉన్న బాధను ఈ పండగతో క్లియర్ చేసుకోవాలని కెప్టెన్ కీర్తికి సలహా ఇచ్చారు నాగార్జు. దీంతో తాను కెమెరా కోసం గేమ్ ఆడుతున్నానని చంటి అన్నాడా ? లేదా ? అనేది తెలియకుండానే మీ ముందు చెప్పాను అంటూ అసలు విషయం చెప్పింది. అయితే కీర్తితో నాగార్జున మాట్లాడుతున్న సమయంలో మధ్యలో ఇన్వాల్వ్ అయ్యింది గీతూ. దీంతో ఆమె పై నాగార్జున ఫైర్ అయ్యారు.
కీర్తి చంటి విషయం చెబుతున్న సమయంలో గీతూ మధ్యలోకి వస్తూ.. చంటి తప్పు ఉద్ధేశంతో ఆ మాట అన్నాడని వాదించడంతో.. ఆరోహి సైతం చంటిది తప్పు అంటూ మద్దతు తెలిపింది. దీంతో ఇంట్లో చంటి పై నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది. అయితే చంటి మాట్లాడిన వీడియోను చూపిస్తూ క్లారిటీ ఇచ్చారు నాగార్జున. అయినా తనకు నెగిటివ్ మాట్లాడినట్లే అనిపిస్తుందని కీర్తి చెప్పడంతో ఆమెకు అర్థమయ్యేలా వివరించాడు బాలాదిత్య. అయితే చంటి ఇష్యూ జరుగుతున్న సమయంలో ప్రతిసారీ గీతూ ఎంటర్ అయ్యి.. అతడిని నెగిటివ్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో ఆమెపై నాగార్జున ఫైర్ అయ్యారు. మాట్లాడుతున్నప్పుడు మధ్యలోకి రావద్దంటూ క్లాస్ తీసుకున్నారు.
గీతూ వెయిట్.. ఫస్ట్ సీడౌన్.. హే నేను వాళ్లతో మాట్లాడుతున్నా కదా.. నేను మిగతా వాళ్లతో మాట్లాడుతుంటే ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతుంటావు. నీకు ఇది బాగా అలవాటు అయిపోయింది అంటూ ఊగిపోయారు నాగ్. దీంతో గీతూ సైలెంట్ అయ్యింది. ఇక కీర్తితో పాటు ఇంట్లో వాళ్లందరూ చంటి తప్పు లేదు అని చెప్పగా.. గీతూ మాత్రం అతడిదే తప్పని వాదించింది. చంటితో తనకు ఏర్పడిన వివాదం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. తాను కూరగాయలు కట్ చేసినందుకు చంటి ఫుడ్ తినడం మానేశాడని.. చాలా బాధపడినట్లు చెప్పగా.. కేవలం ఒక్కసారి మాత్రమే అలా చేశానంటూ వివరణ ఇచ్చుకున్నాడు చంటి.