Sada: ‘మనశ్శాంతిగా ఉండాలంటే వారికి దూరంగా ఉండండి’.. ఆసక్తికర పోస్ట్ చేసిన హీరోయిన్ సదా..

అటు ఫోటోస్ షేర్ చేస్తూ.. ఫాలోవర్లతో తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా తన ఇన్ స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. జీవితంలో అనేక కష్టాలు ఎదురైన సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలంటూ చెప్పుకొచ్చింది.

Sada: 'మనశ్శాంతిగా ఉండాలంటే వారికి దూరంగా ఉండండి'.. ఆసక్తికర పోస్ట్ చేసిన హీరోయిన్ సదా..
Sada
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 03, 2022 | 7:23 AM

జయం సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమయ్యింది సదా. ఆ తర్వాత అవునన్నా కాదన్నా, అపరిచితుడు, దొంగా దొంగది వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ సరసన ఛాన్స్ కొట్టేసి అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించడనమే కాకుండా అటు వెబ్ సిరీస్‏లో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. అటు ఫోటోస్ షేర్ చేస్తూ.. ఫాలోవర్లతో తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా తన ఇన్ స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. జీవితంలో అనేక కష్టాలు ఎదురైన సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలంటూ చెప్పుకొచ్చింది.

” జీవితంలో అందరికీ ఉండాల్సిన లక్ష్యం సంతోషం. మీకంటూ ఆనందాన్ని ఇచ్చే విషయాలను, అభిరుచులను వ్యక్తులను గుర్తించి.. మీ మీలో ఉన్న ఆనందాన్ని వెతకండి. ఇతరులలో మీ సంతోషం ఉండదు. అది మీలోనే ఉంటుంది. మీ గమ్యానికి అడ్డుగా నిలిచే వ్యక్తులు అడుగడుగునా ఉంటారు. దీంతో జీవితంలో చిరాకు కలిగించే పరిసిత్థులు ఎదురవుతాయి. వాటి గురించి ఆలోచిస్తూ ఉండకుండా.. ఆనందాన్నిచ్చే ఇతర విషయాలపై దృష్టి పెట్టాలి. మిమ్నల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం ఎప్పటికీ స్వార్థం కాదు.

ఇవి కూడా చదవండి

స్వార్థానికి ఆత్మవిశ్వానికి చాలా తేడా ఉంటుంది. స్వార్థపూరితంగా ఉండకండి. ఆత్మగౌరవంతో ఉండండి. మనశ్శాంతిగా ఉండాలంటే మీ చుట్టూ ఉన్న స్వా్ర్థపరులకు దూరంగా ఉండండి.” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సదా చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఇటీవలే హాలో వరల్డ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించింది సదా.

View this post on Instagram

A post shared by Sadaa (@sadaa17)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.