AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: అవి కూడా అనుభవ పాఠాలే… సినిమాల ఎంపికపై పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

కెరీర్ తొలి నాళ్ల నుంచి నటనకు ప్రాధన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపును సంపాదించుకుంది. గ్లామర్‌ పాత్రకు దూరంగా ఉంటూ తన క్యారెక్టర్‌కు...

Sai Pallavi: అవి కూడా అనుభవ పాఠాలే... సినిమాల ఎంపికపై పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..
Sai Pallavi
Narender Vaitla
|

Updated on: Oct 03, 2022 | 7:09 AM

Share

ప్రేమమ్‌ చిత్రంతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది అందాల తార సాయి పల్లవి. డాక్టర్‌ విద్యనభ్యసించిన ఈ బ్యూటీ యాక్టర్‌గా ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది. ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన ఈ చిన్నది, ప్రేక్షకులను నిజంగానే ఫిదా చేసింది. కెరీర్ తొలి నాళ్ల నుంచి నటనకు ప్రాధన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకగుర్తింపును సంపాదించుకుంది. గ్లామర్‌ పాత్రకు దూరంగా ఉంటూ తన క్యారెక్టర్‌కు సినిమాలో తగినంత ప్రాధాన్యత ఉంటేనే ఓకే చెప్పే ఈ బ్యూటీ తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమాలో ఎంపికలో తన ఆలోచన ఎలా ఉంటుందన్న ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.

సినిమా కథ మొత్తం తన చుట్టూ తిరుగుతుందా.? లేదా.. అన్నది తనకు ముఖ్యంకాదని, మనసుకు నచ్చిన పాత్రలు చేస్తున్నానా? లేదా? అన్నదే తృప్తిస్తుందని చెప్పుకొచ్చింది. ఈ విషయమై సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘ఓ పాత్ర ఎలా చేయాలన్న విషయంలో నేను ఎప్పుడూ నిబంధనలు పెట్టుకోను, నా పాత్ర కోసం ముందుగానే ప్రత్యేకంగా సిద్ధమయ్యే ప్రయత్నాలు చేయను. సెట్లోని వాతావరణం.. తోటి నటీనటుల అభినయమే తన పాత్ర ఎలా పోషించాలన్న విషయంలో స్పష్టతనిస్తుంది. ఓ కథని చదివేటప్పుడే దాన్ని ఓ సినిమాలా ఆస్వాదించే ప్రయత్నం చేస్తాను’ అని చెప్పుకొచ్చింది.

ఇక స్క్రిప్ట్‌ని ఓకే చేసే సమయంలో ప్రేక్షకుడు సినిమా ఎలా చూస్తాడే.. అలాగే చదివి ఆస్వాదించే ప్రయత్నం చేస్తానని చెప్పిన సాయి పల్లవి.. దీంతో తన పాత్ర ఎలా ఉంటుందన్నది ముందే ఓ అవగాహన వస్తుందని తెలిపింది. ఇక కొన్నిసార్లు పేపర్‌పై రాసిన కథ అదే విధంగా తెరపైకి రాకపోవచ్చని, అలాంటప్పుడు చేదు ఫలితాలు ఎదుర్కోక తప్పదని చెప్పుకొచ్చింది. చేదు ఫలితాలు కూడా ఓ అనుభవ పాఠమేనని చెప్పుకొచ్చింది సాయిపల్లవి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..