Prabhas: ‘నేను ఆదిపురుష్‌లో నటించడానికి కారణం అదే’.. ఆయోధ్య వేదికపై ప్రభాస్‌ ఆసక్తికర విషయాలు..

బాహుబలితో ఒక్కసారిగా నేషనల్ హీరోగా మారిన ప్రభాస్‌ నటిస్తోన్న తాజా చిత్రం ఆదిపురుష్‌. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు...

Prabhas: 'నేను ఆదిపురుష్‌లో నటించడానికి కారణం అదే'.. ఆయోధ్య వేదికపై ప్రభాస్‌ ఆసక్తికర విషయాలు..
Prabhas Adipurush
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 03, 2022 | 7:36 AM

బాహుబలితో ఒక్కసారిగా నేషనల్ హీరోగా మారిన ప్రభాస్‌ నటిస్తోన్న తాజా చిత్రం ఆదిపురుష్‌. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. అంతర్జాతీయ టెక్నీషియన్స్‌ ఈ సినిమా గ్రాఫిక్‌ వర్క్‌ కోసం పని చేస్తుండడం విశేషం. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా సినిమా ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది. దసరా సందర్భంగా ఆయోధ్య నగరంలో సినిమా టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. శ్రీరాముడి పాత్రలో ప్రభాస్‌ నటిస్తుండగా, రావణాసురుడి పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. ఆదిపురుష్‌ టీజర్‌ ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. ఇదిలా ఉంటే ఆదివారం టీజర్‌ విడుదల చేసిన తర్వాత ఏర్పాటు చేసిన ఈవెంట్‌ హీరో ప్రభాస్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ ఈ చిత్రంలో తాను నటించడానికి గల కారణాన్ని వివరించారు.

ఇవి కూడా చదవండి

మొదట రాముడి పాత్రలో నటించాల్సి వచ్చినప్పుడు మూడు నెలలు సినిమాకు అంగీకరించలేదని తెలిపిన ప్రభాస్‌.. ప్రతి మనిషిలోనూ రాముడు ఉంటాడని, రాముడిపై ఉన్న భక్తి, భయమే తనను ‘ఆదిపురుష్‌’ సినిమాలో నటించేలా చేశాయని చెప్పుకొచ్చారు. శ్రీరాముడి దీవెనలు తీసుకోవడానికి ఆయోధ్య వచ్చామని తెలిపారు ప్రభాస్‌. టీజర్‌ లాంచ్‌కు ముందు ప్రభాస్‌ చిత్ర యూనిట్‌తో కలిసి ఆయోధ్య రాముడిని దర్శించుకున్నారు. ఇక ఈ చిత్రంలో సీతగా కృతిసనన్‌, లక్ష్మణుడిగా సన్నీసింగ్‌ నటిస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే