Ponniyin Selvan 2: పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 నుంచి క్రేజీ అప్డేట్.. మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

కరోనా కారణంగా ఈ సినిమాకు చాలా గ్యాప్ వచ్చింది. మొత్తంగా ఈ సినిమా మొదటి పార్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మణిరత్నం.

Ponniyin Selvan 2: పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 నుంచి క్రేజీ అప్డేట్.. మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Ps2
Follow us

|

Updated on: Dec 28, 2022 | 5:43 PM

మణిరత్న డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాలో భారీ తారాగణం నటించిన విషయం తెలిసిందే. పొన్నియన్ సెల్వన్ సినిమా నిజానికి ఎప్పుడో రావాల్సింది కానీ ఆలస్యం అయ్యింది. కరోనా కారణంగా ఈ సినిమాకు చాలా గ్యాప్ వచ్చింది. మొత్తంగా ఈ సినిమా మొదటి పార్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు మణిరత్నం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అన్ని ప్రాంతాలనుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా. కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాశ్ రాజ్, పార్థిబన్, ఐశ్వర్య లక్ష్మీ, ప్రభు, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, జయరాం నటించారు. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 30న ఈ సినిమా విడుదలైన ఈ సినిమాకు ఏఆర్ రహమాన్ సంగీత దర్శకత్వం వహించగా.. సీనియర్ రైటర్ జయమోహన్ డైలాగులు రచించారు.

తాజాగా ఈ సినిమా సెకండ్ పార్ట్ నుంచి ఆల్డిరిపోయే ఆప్డేట్ ఇచ్చారు. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఓ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఆదిత్య కరికాలన్( విక్రమ్), పొన్నియన్ సెల్వన్( జయం రావి), అలాగే వల్లవరాయ (కార్తీ) లతోపాటు నందిని (ఐశ్వర్య  ఐశ్వర్య రాయ్)లను చూపించారు.

ఇవి కూడా చదవండి

ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సెకండ్ పార్ట్ లో ఏం జరిగిద్దా అని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్  చివరిలో ఐశ్వర్య రాయ్ డ్యూయల్ రోల్ ను చూపించారు. అసలు ఆవిడ ఎవరు.? పొన్నియన్ సెల్వన్ ను ఎందుకు కాపాడాలని చూస్తుంది అన్నది సెకండ్ పార్ట్ లో చూపించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..