Unstoppable with NBK2: డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. రెండు పార్ట్‌లుగా బాలయ్య- ప్రభాస్ ఎపిసోడ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

క్రేజీ క్రేజీగా గెస్టులను సెట్ చేసేస్తూ.. అన్‌స్టాపబుల్ షోను ఎంటర్ టైన్మెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేస్తున్నారు. తన స్ట్రెయిట్ అండ్ డైరెక్టర్ మాటలతో.. గెస్టులను ఇరకాటంలో పెట్టేసి.. కొత్త కొత్త విషయాలను రాబడుతున్నారు.

Unstoppable with NBK2: డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. రెండు పార్ట్‌లుగా బాలయ్య- ప్రభాస్ ఎపిసోడ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Prabhas, Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 28, 2022 | 5:13 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అదరగొడుతోన్న అన్ స్టాపబుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ఇండియాలోనే టాప్ టాక్ షోగా నిలబెట్టారు బాలయ్య. ఇక ఈ టాక్ షో ఫస్ట్ సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకొని.. ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. క్రేజీ క్రేజీగా గెస్టులను సెట్ చేసేస్తూ.. అన్‌స్టాపబుల్ షోను ఎంటర్ టైన్మెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేస్తున్నారు. తన స్ట్రెయిట్ అండ్ డైరెక్టర్ మాటలతో.. గెస్టులను ఇరకాటంలో పెట్టేసి.. కొత్త కొత్త విషయాలను రాబడుతున్నారు. దెబ్బకు అందరి థింకింగ్ మారిపోయేలా చేస్తున్నారు. ఇక ఇప్పటికే యంగ్ హీరోలందర్నీ తన షోకు తీసుకొస్తున్న బాలయ్య.. తాజాగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌ను కూడా తన షోకు పట్టుకొచ్చేశారు. ఎస్ ! ఆ సారి అన్‌స్టాపబుల్ షోలో.. డార్లింగ్ ప్రభాస్ ఎలాంగ్ విత్ హిజ్‌ బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్‌తో కలిసి సందడి చేశారు. అన్‌ప్టాపబుల్ ఎపిసోడ్ 6గా త్వరలో ఆహాలో స్ట్రీమ్‌ అవ్వనుంది. తాజాగా ఈ ఎపిసోడ్ గురించి అదిరిపోయే న్యూస్ ఇచ్చారు ఆహా టీమ్.

ప్రభాస్ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ ఎపిసోడ్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ అంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. బాలయ్య షోలో ప్రభాస్ లుక్ బాగా వైరల్ అయ్యింది. డార్లింగ్ వింటేజ్ లుక్ అదిరిపోయింది. ప్రభాస్ చాలా ఉత్సహంగా బాలయ్య షోలో సందడి చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేయనున్నారు. మొదటి ఎపిసోడ్ లో కేవలం ప్రభాస్ మాత్రమే ఉంటాడు. ఆయనతో బాలయ్య చేసే సందడి, సరదా కబుర్లు చూపించనున్నారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 30న స్ట్రీమింగ్ చేయనున్నారు. అలాగే రెండో పార్ట్ లో ప్రభాస్ తో పాటు అతని మిత్రుడు గోపీచంద్ కూడా జాయిన్ అవ్వనున్నాడు. ఈ ఇద్దరు ఇండస్ట్రీలో ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు అన్నది ఈ ఎపిసోడ్ ను చూపించనున్నారు. ఇది జనవరి 6న స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ రెండు ఎపిసోడ్స్ కు అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే బిగినింగ్ అని.. రెండో పార్ట్ కు అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ది కంక్లూజన్ అని పేరుపెట్టారు.