Ram Charan: మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసం.. శంకర్ భారీ సర్‌ప్రైజ్.. ఇక పూనకాలే
ట్రిపుల్ ఆర్ హిట్ తో తరువాత మరేం పట్టించుకోకుండా... మరో సినిమాతో బిజీగా మారిపోయిన ఈ స్టార్.. తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ తో కలిసి.. మరో పాన్ ఇండియా మూవీకి వర్క్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్! ఇప్పుడీయన టాలీవుడ్ టాప్ స్టార్ మాత్రమే కాదు.. పాన్ ఇండియా క్రేజీ స్టార్. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు మేకర్స్ అందరూ ఎదరుచూసేంత క్రేజ్ పెంచుకున్న అల్ట్రా మెగా పవర్ స్టార్. ట్రిపుల్ ఆర్ హిట్ తో తరువాత మరేం పట్టించుకోకుండా… మరో సినిమాతో బిజీగా మారిపోయిన ఈ స్టార్.. తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ తో కలిసి.. మరో పాన్ ఇండియా మూవీకి వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ గురించి ఫిల్మీ సర్కిల్లో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అందర్నీ తెగ ఆకట్టకుంటోంది.
దిల్ రాజు ప్రొడక్షన్లో స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో .. మెగా పవర్ స్టార్ చెర్రీ హీరోగా తెరకెక్కుతుండడంతో.. ఈ సినిమాపై ఎప్పటి నుంచో విపరీతమైన అంచనాలున్నాయి. అయితే ఈ అంచనాలను అందుకునేందుకు సినిమాను మరింతగా ప్రమోట్ చేసుకునేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశారట డైరెక్టర్ శంకర్.
తన స్టైల్లోనే వెరీ లావిష్ గా ఓ ఈవెంట్ ఆర్గనైజ్ చేసి.. చెర్రీ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయనున్నారట డైరెక్టర్ శంకర్. అందుకోసం ఇప్పటినుంచే ప్రిపేర్ అవుతున్నారట. చెర్రీని చూస్తే చాలు..గూస్ బంమ్స్ వచ్చేలా ఓ పవర్ పుల్ మోషన్ పోస్టర్ ను కూడా ఇప్పటి నుంచే డిజైన్ చేపిస్తున్నారట డైరెక్టర్ శంకర్. సంక్రాంతి వరకు పర్ఫెక్ట్ టైం చూసుకుని ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేయనున్నారట శంకర్ అండ్ టీం.








