Vakeel Saab: ఒరిజినల్ మించి సత్తా చాటిన వకీల్ సాబ్…. మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది..
వకీల్ సాబ్.. పవన్ కల్యాణ్ రీసెంట్ బ్లాక్ బస్టర్. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా పవన్ ఇమేజ్‌కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.

Vakeel Saab: వకీల్ సాబ్.. పవన్ కల్యాణ్ రీసెంట్ బ్లాక్ బస్టర్. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ మూవీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా పవన్ ఇమేజ్‌కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. అందుకే రీ ఎంట్రీకి ఏరి కోరి వకీల్ సాబ్‌ను ఎంచుకున్నారు పవర్ స్టార్. ఈ విషయంలో పవన్ లెక్క ఏ మాత్రం తప్పలేదు. ఒరిజినల్ మించి సత్తా చాటింది వకీల్ సాబ్. శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫుల్ లాయర్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ ను తెరపైన చూసిన అభిమానుల ఆనందాన్ని అవధులు లేవనే చెప్పాలి. అంతే కాదు పవన్ స్టామినాను ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది ఈ సినిమా. తాజాగా IMDB రేటింగ్స్‌లో వకీల్ సాబ్ హవా స్పష్టంగా కనిపించింది. ఒరిజినల్ మూవీ పింక్‌కు 75.5 పర్సెంట్ రేటింగ్ రాగా… మన వకీల్ సాబ్ మాత్రం 84.4 పర్సెంట్‌తో టాప్‌లో నిలిచారు. ఒరిజినల్ వర్షన్‌లో లేని మాస్ కమర్షియల్ పాయింట్స్ యాడ్ చేయటం వకీల్ సాబ్‌కు బాగా కలిసొచ్చింది.
పింక్ సినిమా తమిళ రీమేక్ నేర్కొండ పార్వై ఈ రేసులో థర్డ్ పేస్ల్‌తో సరిపెట్టుకుంది. 73.4 పర్సెంట్ రేంటిగ్‌తో మూడో స్థానంలో నిలిచింది ఈ మూవీ. అజిత్ హీరోగా తెరకెక్కిన నేర్కొండ పార్వై కూడా బిగ్ హిట్. అయితే IMDB లిస్ట్ మాత్రం ఒరిజినల్‌ను… ఫస్ట్ రీమేక్‌ను దాటి.. టాప్ పోజిషన్‌లో నిలిచింది వకీల్ సాబ్.
మరిన్ని ఇక్కడ చదవండి :