Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashanth Neel: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‏గా ప్రశాంత్ నీల్.. మరో హీరోతో భారీ ప్రాజెక్ట్ ?

ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించాలని

Prashanth Neel: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‏గా ప్రశాంత్ నీల్.. మరో హీరోతో భారీ ప్రాజెక్ట్ ?
Prashanth Neel
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 08, 2021 | 7:30 AM

ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించాలని బడా హీరోలంతా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో తెలుగులోని అగ్రహీరోలంతా.. ప్రశాంత్ నీల్ కోసం తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. యంగ్ రెబల్ స్టార్ ప్రధాన పాత్రలో సలార్ మూవీ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ నుంచి మరో మాస్ యాంగిల్ ను చూపించబోతున్నట్లు.. తెలుస్తుంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ లు రివీల్ కావడంతో.. సలార్ సత్తా ఏ లెవెల్లో ఉంటుందో.. బయట పెట్టేశాడు ప్రశాంత్ నీల్.

ఇటు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్నట్లు ప్రశాంత్ నీల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కాంబినేషన్ లో మరో మాస్ మూవీ కన్ఫర్మ్ అంటున్నారు అభిమానులు. ఇదిలా ఉండగానే.. ఈ డైరెక్టర్ బర్త్ డే సందర్భంగా.. ట్రిపుల్ ఆర్ మూవీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ తో.. విషెస్ చెబుతూ.. కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రశాంత్ నెక్ట్స్ ఫిల్మ్ ఎవరితో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ట్రిపుల్ ఆర్ మేకర్స్ తో.. రామ్ చరణ్ మరో మూవీ చేసేందుకు ఒప్పుకున్నట్లుగా సమాచారం. దీనికి డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ ను అనుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. దీంతో డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ తన నెక్ట్స్ మూవీ.. చరణ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తుందనే టాక్.. సినీ సర్కిల్ లో గట్టిగా వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం చరణ్ ట్రిపుల్ ఆర్ చేస్తుండగా.. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు. ఇటు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2, సలార్ తర్వాత, ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయనున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాకే.. చరణ్, ప్రశాంత్ కాంబినేషన్ లో మూవీ వచ్చే ఛాన్స్ ఉందట. అయితే తనకు వస్తున్న ఆఫర్లపై ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన సినిమాలకు ఎప్పుడూ స్టార్లను సెలక్ట్ చేయనని పెద్ద హీరోలు వారి సినిమాలకు తనను సెలక్ట్ చేసుకుంటున్నారని తెలిపాడు. అది తన సినీ జర్నీకి బూస్ట్ అవుతుందని  చెప్పుకొచ్చాడు.

Also Read: Malavika Mohanan: మెగాపవర్ స్టార్ సరసన మాస్టర్ బ్యూటీ.. చరణ్ సినిమాలో హీరోయిన్ గా మాళవిక..

మళ్లీ ప్రేమలో పడ్డానన్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.. ఇంతకు అమ్మడి న్యూ లవ్ ఎవరో తెలుసా..