Puri Jagannadh: బాలీవుడ్ లో బిజీ కావాలని చూస్తున్న టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్.. హిందీ సినిమాల పై దృష్టి పెట్టనున్న పూరీ..

పూరీ టాలీవుడ్ ను వదిలిపెట్టబోతున్నారా...? ఆర్జీవీలా కొంత కాలం బాలీవుడ్ వాసం చేయబోతున్నారా..? అందుకు తగ్గట్టే ప్రణాళికలు వేసుకున్నారా..?

Puri Jagannadh: బాలీవుడ్ లో బిజీ కావాలని చూస్తున్న టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్.. హిందీ సినిమాల పై దృష్టి పెట్టనున్న పూరీ..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 07, 2021 | 6:21 PM

Puri Jagannadh: పూరీ టాలీవుడ్ ను వదిలిపెట్టబోతున్నారా…? ఆర్జీవీలా కొంత కాలం బాలీవుడ్ వాసం చేయబోతున్నారా..? అందుకు తగ్గట్టే ప్రణాళికలు వేసుకున్నారా..? అంటే అవుననే అంటున్నారు ఫిల్మ్‌ వర్గాలు.  డేరింగ్‌ అండ్ డాషింగ్ కథలతో తనదైన ఫిలాసఫికల్ టచ్‌ డైలాగులతో సినిమాలు తీసే పూరి.. ఇక బాలీవుడ్ బాట పట్టనున్నారనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం బాలీవుడ్ బడా డైరెక్టర్ కరణ్ జోహరేనట. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా సినిమా లైగర్‌ను తెరకెక్కించడంలో బిజీగా ఉన్న పూరీకి… బడా ప్రొడ్యూసర్ కమ్‌ డైరెక్టర్ హిందీలోనే కంటిన్యూగా సినిమాలు తీయాలని కోరారట. లైగర్ రషెస్.. పూరీ డైలాగ్ ఫార్మేసన్ అండ్‌ సీన్ కంపోజిషన్ అబ్జర్వ్‌ చేసిన కరణ్‌.. తన ప్రొడక్షన్లోనే ఓ సినిమా తీయమని ఆఫర్ కూడా ఇచ్చారట. దీంతో కాదనలేకపోయిన పూరీ ఓకే చెప్పేశారట. ఇప్పుడిదే విషయం బీటౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

ఇక ఇప్పటికే పూరీ.. అమితాబ్‌ డైరెక్షన్లో “బుడ్డా హోగ తేరా బాప్‌” సినిమా తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆ సినిమా తరువాత మహేష్ హీరోగా నటించిన “బిజినెస్ మ్యాన్” సినిమాను హిందీలో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేశారు కాని.. అది వర్కవుట్ అవలేదు. ఇక ఇప్పుడు కరణ్ సపోర్ట్‌తో బాలీవుడ్‌ ను దడదడలాండించేదుకు సిద్దమవుతున్నారు పూరీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Puri Jagannath: మరోసారి ఆ మెగా హీరోతో డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ సినిమా.. ఫ్యాన్స్ కు పూనకాలే..

Varun Tej: బాక్సింగ్ రింగ్ లోకి దిగడానికి సిద్దమవుతున్న వరుణ్ తేజ్… జులై నుంచి కొత్త షెడ్యూల్.. ( వీడియో )

Pawan Kalyan: పవర్ స్టార్ అభిమానులకు పండగే.. పవన్ -హరీష్ శంకర్ సినిమా పట్టాలెక్కేది అప్పుడే..