AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Evelyn Sharma: బెస్ట్ ఫ్రెండ్‏ను సీక్రెట్‏గా పెళ్లి చేసుకున్న ‘సాహో’ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..

దేశంలో కరోనా రెండో దశ విలయతాండవం చేస్తున్న.. పెళ్లి వేడుకలు మాత్రం ఆగడం లేదు. అతి కొద్ది మంది బంధువులు మాత్రమే హజరు

Evelyn Sharma: బెస్ట్ ఫ్రెండ్‏ను సీక్రెట్‏గా పెళ్లి చేసుకున్న 'సాహో' బ్యూటీ.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..
Evelyn Sharma
Rajitha Chanti
|

Updated on: Jun 07, 2021 | 2:13 PM

Share

దేశంలో కరోనా రెండో దశ విలయతాండవం చేస్తున్న.. పెళ్లి వేడుకలు మాత్రం ఆగడం లేదు. అతి కొద్ది మంది బంధువులు మాత్రమే హజరు కావాలని ప్రభుత్వాలు నిబంధనలు విధించడంతో.. సన్నిహితుల మధ్యే పెళ్లి వేడుకలను కానిచ్చేస్తున్నారు. ఇలా కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాకుండా.. సెలబ్రెటీలు కూడా నిరాడంభరంగా పెళ్లితంతు కానిచ్చేస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ ప్రణీత, బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్ పెళ్లి చేసుకోని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తాజాగా మరో హీరోయిన్ పెళ్లి.. తన బెస్ట్ ఫ్రెండ్‏ను వివాహం చేసుకుంది.

బాలీవుడ్ నటి ఎవలిన్ శర్మ ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ తుషాన్ భిండిని వివాహం చేసుకుంది. గత నెలలో వీరి పెళ్లి జరగ్గా.. ఆలస్యంగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది ఎవలిన్. ఈ సందర్భంగా ఆమె భర్తతో కలిసి దిగిన పెళ్లినాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. బెస్ట్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోవడం కన్నా సంతోషకరమైనది ఏముంటుంది ? వైవాహిక జీవితానికి ఆరంభం పలికినందుకు ఎంతో ఎగ్జైట్ అవుతున్నాం అని ట్వీట్ చేసింది ఎవలిన్. ఇదిలా ఉంటే.. వీరిద్ధరు 2018లో ఓ పార్టీలో కలుసుకున్నారు. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. దీంతో మరసటి సంవత్సరం తుషాన్.. ఎవలిన్‏కు మ్యారెజ్ ప్రపోజ్ చేశాడు. ఇందుకు ఆమె అంగీకారం తెలపడంతో.. ఆ వెంటనే అక్టోబర్ లో వీరి నిశ్చితార్థం జరిగింది. కానీ కరోనా కారణంగా పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి గత నెలలో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లితంతును పూర్తి చేశారు. ఎవలిన్‌ శర్మ ‘ఏ జవానీ హై దీవాని’, ‘యారియన్‌’ సహా పలు చిత్రాల్లో నటించింది. ‘ఏ దిజవానీ హై దీవాని’ చిత్రం రిలీజై ఇటీవలే ఎనిమిదేళ్లు పూర్తి అయింది. అంతేకాదు.. ప్రభాస్ నటించిన సాహో చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది ఎవలిన్.

ట్వీట్..

Also Read: Bigg Boss Season 5: తెలుగు బిగ్ బాస్‌లోకి ఆర్‌ఎక్స్ 100 బ్యూటీ.? సీజన్ స్టార్ అయ్యేది అప్పుడేనా.!

SriCharan Pakala : సినిమాటోగ్రాఫర్‏కు ప్రమాదం.. కాపాడమంటూ వేడుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్.. విరాళాలు ఇవ్వాలంటూ ట్వీట్..

Srihari: డబ్బులో రాయిని చుట్టి గుడ్డ కట్టి బాల్కానీ నుంచి విసిరేసేవారు.. శ్రీహరి గొప్పతనం గురించి చెప్పిన స్టార్ కమెడియన్..