Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srihari: డబ్బులో రాయిని చుట్టి గుడ్డ కట్టి బాల్కానీ నుంచి విసిరేసేవారు.. శ్రీహరి గొప్పతనం గురించి చెప్పిన స్టార్ కమెడియన్..

Comedian Prudhvi Says About Srihari: విలక్షణ నటుడు స్వర్గీయ శ్రీహరి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు.

Srihari: డబ్బులో రాయిని చుట్టి గుడ్డ కట్టి బాల్కానీ నుంచి విసిరేసేవారు.. శ్రీహరి గొప్పతనం గురించి చెప్పిన స్టార్ కమెడియన్..
Srihari
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 07, 2021 | 12:26 PM

Comedian Prudhvi Says About Srihari: విలక్షణ నటుడు స్వర్గీయ శ్రీహరి.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. విలన్, హీరో, సపోర్టింగ్ ఇలా ఎన్నో పాత్రలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీహరి. అలాగే అడిగిన వారికి లేదనకుండా సాయం చేసి.. ఎన్నో గుప్తదానాలు చేసి రియల్ హిరో అనిపించుకున్నారు. డిస్కో శాంతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఆయన మరణానంతరం కుటుంబం ఎన్ని కష్టాలు పడుతుందో ఆ మధ్య డిస్కో శాంతి చెబుతూ కన్నీరుపెట్టుకున్నారు. ఆయన ఎంతో మందికి సాయం చేశారు.. ఎన్నో దానాలు చేశారు.. సొంత వాళ్లు కూడా ఆయన ప్రాపర్టీని వాడుకున్నారు. ఇప్పుడు ఏ ఒక్కరూ కూడా సాయం చేయడం లేదు అంటూ శ్రీహరి గుప్తదానాల గురించి డిస్కో శాంతి చెబుతూ ఆ మధ్య ఎమోషనల్ అయ్యారు.

అలాగే ఇటు సినీ పరిశ్రమలో కూడా ఎంతో మంది శ్రీహరి సేవా గుణాన్ని చెబుతుంటారు. తాజాగా కమెడియన్ పృథ్వీ కూడా శ్రీహరి గొప్పతనం గురించి వివరించారు. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గోన్న పృథ్వి.. శ్రీహరి మనస్తత్వం గురించి 30 ఇయర్స్ ఇండస్ట్రీ గురించి పృథ్వీ మాట్లాడుతూ.. ఆయన ఎంత గొప్పవారంటే.. జూబ్లిహిల్స్‏ రోడ్ నంబర్ 45లోని ఆయన ఇంటి ముందు ఎవరైనా ఉంటే.. బాల్కనీ నుంచి డబ్బులో రాయి చుట్టు గుడ్డ కట్టి విసిరేవారు.. వాళ్లు అలా తీసి చూసుకొని ఆయనకు దండం పెట్టేవారు. కొన్ని వేల గుప్తదానాలు చేశారు అంటూ చెప్పుకొచ్చారు పృథ్వి.

Also Read: Nikhil: పది లక్షలకు పైగా బిల్లులా ?.. వీటిని ఎవరు నియంత్రిస్తారు ? హస్పిటల్ బిల్లులపై హీరో నిఖిల్ ఆగ్రహం..

Dilip Kumar: “వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‏లను నమ్మకండి”.. దిలీప్ కుమార్ ఆరోగ్యం పై స్పందించిన ఆయన భార్య సైరా భాను..

Bhumika in Bigg Boss : బిగ్‏బాస్‏లో భూమిక ?.. ఆఫర్లపై స్పందించిన అందాల తార.. ఎప్పుడూ కెమెరాలుంటే కష్టం అంటూ..

Akhanda Movie: బాలయ్య సినిమా పై మరో బజ్.. ‘అఖండ’ రిలీజ్ అయ్యేది ఆరోజే..?