AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhumika in Bigg Boss : బిగ్‏బాస్‏లో భూమిక ?.. ఆఫర్లపై స్పందించిన అందాల తార.. ఎప్పుడూ కెమెరాలుంటే కష్టం అంటూ..

Bhumika : బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. విదేశాల్లో పుట్టిన ఈ షోకు ఇప్పుడు భారతదేశంలో

Bhumika in Bigg Boss : బిగ్‏బాస్‏లో భూమిక ?.. ఆఫర్లపై స్పందించిన అందాల తార.. ఎప్పుడూ కెమెరాలుంటే కష్టం అంటూ..
Bhumika
Rajitha Chanti
|

Updated on: Jun 07, 2021 | 9:28 AM

Share

Bhumika : బిగ్‏బాస్ రియాల్టీ షోకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. విదేశాల్లో పుట్టిన ఈ షోకు ఇప్పుడు భారతదేశంలో అత్యంత ఆదరణ కురిపించారు బుల్లితెర ప్రేక్షకులు. మొదటగా హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ షో.. ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళం ఇలా అన్ని భాషలలోనూ విస్తరించింది. అయితే ఏ భాషలో అయిన ఈ షోకు ఆదరణకు ఎక్కువైంది. ఇక సెలబ్రెటీలు సైతం ఈ షోలో కనిపించాలని ఆసక్తి చూపిస్తుంటారు. బిగ్ బాస్ షో ప్రారంభం అవుతుంది అనగానే.. ముందుగా అందులో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరా ? అని తెలుసుకోవడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు అభిమానులు. అలాగే షో నుంచి పలువురు సెలబ్రెటీలకు ఆఫర్స్ వచ్చాయంటూ.. సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతుంటాయి. అలాగే ఇటీవల సీనియర్ హీరోయిన్ భూమికకు ఈ షో నుంచి ఆఫర్ వచ్చిందంటూ.. త్వరలోనే ఆమె బిగ్ బాస్ సీజన్ 15లో పాల్గోనబోతుందంటూ కామెంట్స్ వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై భూమిక స్పందించింది.

తనకు బిగ్ బాస్ నుంచి ఆఫర్స్ వచ్చాయని.. కానీ వాటిని ఇంకా అంగీకరించలేదని స్పష్టం చేసింది. ‘నేను బిగ్ బాస్ షోకు వెళ్తున్నట్లుగా వస్తున్న వార్తలన్ని అవాస్తవం. నాకు బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. ఒకవేళ షో కోసం నన్ను సంప్రదించినా.. నేను వెళ్ళను. గతంలో 1,2,3 సహా మరికొన్ని సీజన్లకు నాకు ఆఫర్స్ వచ్చాయి. కానీ నేను ఒప్పుకోలేదు. భవిష్యత్తులో కూడా బిగ్ బాస్ కు వెళ్లే ప్రసక్తి లేదు. 24 గంటలు కెమెరాల ముందే ఉండటం నాకు ఇష్టం లేదు” అని భూమిక తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది.

ట్వీట్..

Also Read: Sai Pallavi: ‘మొటిమ‌ల విష‌యంలో నేనూ ఆందోళ‌న చెందాను.. కానీ ప్రేమ‌మ్ త‌ర్వాత‌’. ఆస‌క్తిర విష‌యం చెప్పిన హైబ్రిడ్ పిల్ల‌

Bigg Boss Season 5: తెలుగు బిగ్ బాస్ సీజన్ 5కు ముహూర్తం ఫిక్స్.! కంటెస్టెంట్స్ వీరేనా.!!