Sai Pallavi: ‘మొటిమల విషయంలో నేనూ ఆందోళన చెందాను.. కానీ ప్రేమమ్ తర్వాత’. ఆసక్తిర విషయం చెప్పిన హైబ్రిడ్ పిల్ల
Sai Pallavi: ప్రేమమ్ సినిమాతో కుర్రకారు మతులను పొగొట్టింది అందాల తార సాయిపల్లవి. ఇక ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను నిజంగానే ఫిదా చేసింది. కెరీర్ తొలినాళ్ల నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా...
Sai Pallavi: ప్రేమమ్ సినిమాతో కుర్రకారు మతులను పొగొట్టింది అందాల తార సాయిపల్లవి. ఇక ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను నిజంగానే ఫిదా చేసింది. కెరీర్ తొలినాళ్ల నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మాత్రమే నటిస్తూ.. తనకంటూ ఓ పత్యేక గుర్తింపును సంపాదించుకుందీ చిన్నది. సహజ నటన, చలాకీ మాటలతో కట్టి పడేసే సాయి.. వరుస అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది.
ఇక అత్యంత సహజంగా కనిపించడానికి ప్రయత్నించే సాయి పల్లవి.. చివరికీ తన మొహంపై ఉన్న మొటిమలను మేకప్‌తో కవర్ చేసుకోదు. అయితే సహజంగా ముఖంపై మొటిమలు ఉంటే యువత కంగారు పడిపోతుంటారు. మరీ ముఖ్యంగా మహిళలు రకరకాల క్రీమ్‌లు రాస్తుంటారు. మరి సాయి పల్లవికి అలాంటి భావన ఎప్పుడూ కలగలేదా.? అంటే కచ్చితంగా కలిగిందని చెబుతోందీ బ్యూటీ. ప్రేమమ్ చిత్రానికి ముందు తాను కూడా మొటిమల విషయంలో చాలా కంగారు పడేదాన్నని చెప్పుకొచ్చిన సాయిపల్లవి.. మొటిమలు తగ్గడం కోసం ఎన్నో క్రీములను వాడడని చెప్పింది. అయితే ప్రేమమ్ సినిమా తర్వాత తనకు అభిమానులు పెరగడంతో.. తనను తనలాగే స్వీకరిస్తున్నారని అర్థమైందని చెప్పుకొచ్చింది. ఆత్మ స్థైర్యాన్ని మించిన అందం లేదని గ్రహించానని తన మనసులో మాటను చెప్పేసింది.
Also Read: Family Man 2: సమంత పాత్ర చుట్టూ ముదురుతున్న వివాదం.. అమేజాన్‌కు అల్టిమేటం జారీ చేసిన తమిళ సంఘాలు..
Tadi Deepika: అంతర్వేది మహిళకు అరుదైన అవకాశం.. ఐక్యరాజ్యసమితి సదస్సుకు ఎంపిక
Ananya Nagalla: మరీ ఇంత అందమా.. కుర్రకారు గుండెలను షేక్ చేస్తోన్న అనన్య నాగళ్ల