Bigg Boss Season 5: తెలుగు బిగ్ బాస్ సీజన్ 5కు ముహూర్తం ఫిక్స్.! కంటెస్టెంట్స్ వీరేనా.!!

కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది కాస్తా వాయిదా పడింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మళ్లీ అదుపులోకి వస్తుండటంతో ఐదో సీజన్‌ను...

Bigg Boss Season 5: తెలుగు బిగ్ బాస్ సీజన్ 5కు ముహూర్తం ఫిక్స్.! కంటెస్టెంట్స్ వీరేనా.!!
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 09, 2021 | 12:02 PM

బిగ్‌బాస్‌ షో.. దీని గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. భాష ఏదైనా కూడా ఈ షో మొదలైతే చాలు అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. ఇక తెలుగులో అయితే వేరే లెవెల్ అనుకోండి. మొదటి సీజన్‌ నుంచి ఈ షో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. గత నాలుగు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు ఐదో సీజన్‌ ప్రారంభించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి బిగ్ బాస్ సీజన్ 5 ఈ సమ్మర్‌లో ప్రారంభించాల్సి ఉండగా.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది కాస్తా వాయిదా పడింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మళ్లీ అదుపులోకి వస్తుండటంతో ఐదో సీజన్‌ను మొదలు పెట్టేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేసుకుంటున్నారట.

ఇందులో భాగంగానే ప్రస్తుతం కంటెస్టెంట్స్ ఎంపిక కొనసాగుతోందని సమాచారం. వారం పదిరోజుల్లో కంటెస్టెంట్లను ఖరారు చేసి.. క్వారంటైన్‌లో ఉంచిన తర్వాత సీజన్ స్టార్ట్ చేయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. అన్ని అనుకున్నట్లు జరిగితే జూలై రెండో వారంలో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ప్రారంభం కానునట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనబోతున్న కంటెస్టెంట్స్ పేర్లు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. షణ్ముఖ్‌ జశ్వంత్, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్‌ ప్రవీణ్‌, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సింగర్‌ మంగ్లీ, ఆ లిస్టులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంతవరకు ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సి ఉంది. కాగా, ఈ ఐదో సీజన్‌ కూడా కింగ్‌ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవరిస్తాడని తెలుస్తోంది.

Also Read:

బొటన వేలు కంటే పక్కన ఉండే వేలు పెద్దదిగా ఉందా.? మీ కాలి వేళ్లు భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో తెలుసా.!

ఈ ఆహార పదార్ధాలను పెరుగుతో పాటు అస్సలు తినకూడదు.! చాలా డేంజర్.. అవేంటంటే..

దట్టమైన అడవిలో ఊగుతూ కనిపించిన మర్మమైన బొమ్మ.. గగుర్పొడిచే దృశ్యం.. చివరికి ట్విస్ట్ ఏంటంటే.?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే