Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buchi Babu: ఆసక్తి రేకేతించిన క్రేజీ కాంబో.. యంగ్ టైగర్ తో ఉప్పెన దర్శకుడి సినిమా ఉన్నట్టా..? లేనట్టా..?

ఉప్పెన సినిమాతో సంచలన విజయం సాధించారు దర్శకుడు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ఆయన దగ్గర పనిచేసిన బుచ్చిబాబు.

Buchi Babu: ఆసక్తి రేకేతించిన క్రేజీ కాంబో.. యంగ్ టైగర్ తో ఉప్పెన దర్శకుడి సినిమా ఉన్నట్టా..? లేనట్టా..?
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 07, 2021 | 2:34 PM

Buchi Babu: ఉప్పెన సినిమాతో సంచలన విజయం సాధించారు దర్శకుడు బుచ్చిబాబు సాన. సుకుమార్ శిష్యుడిగా డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ఆయన దగ్గర పనిచేసిన బుచ్చిబాబు. దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా ఉప్పెన. మెగా ఫ్యామిలీ నుంచి  వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాతో బెంగుళూరు బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫ్రెష్ లవ్ కంటెంట్ తో బ్యూటీఫుల్ గా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాడు బుచ్చిబాబు. అంతే కాదు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను కూడా సాధించింది. మొదటి సినిమాతోనే 100కోట్లకు పైగా వసూల్ చేసిన హీరోగా వైష్ణవ్ తేజ్ రికార్డ్ సృష్టించారు. ఇప్పుడు బుచ్చిబాబు తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం ఉత్సాహం చూపిస్తున్నారు.

అయితే బుచ్చిబాబు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడని ఈ మధ్య వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్ కీ .. సుకుమార్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది .. అందువలన బుచ్చిబాబుతో చేయడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పి ఉంటాడని అంతా అనుకున్నారు. అంతే కాదు ఈ సినిమాకూడా ఓ బ్యూటీఫుల్ ప్రేమ కథ అని తెలుస్తుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన తర్వాత కొరటాల శివ తో సినిమా చేస్తున్నాడు తారక్. ఆతర్వాత బుచ్చిబాబుతో సినిమా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇంకా బుచ్చిబాబు కథపైనే కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. ఈ వార్తల పై ఇంతవరకు అటు బుచ్చిబాబు కానీ ఇటు తారక్ కానీ స్పందించలేదు. ఇక ఇప్పటికైనా ఈ వార్త పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి:

Sai Pallavi: ‘మొటిమ‌ల విష‌యంలో నేనూ ఆందోళ‌న చెందాను.. కానీ ప్రేమ‌మ్ త‌ర్వాత‌’. ఆస‌క్తిర విష‌యం చెప్పిన హైబ్రిడ్ పిల్ల‌

ఆరు బయట నవారు మంచం మీద పిల్లలతో అలా బన్నీ హాయి ని అనుభవిస్తున్న అల్లు అర్జున్ : Allu Arjun Video viral.

Family Man 2: స‌మంత పాత్ర చుట్టూ ముదురుతున్న వివాదం.. అమేజాన్‌కు అల్టిమేటం జారీ చేసిన త‌మిళ సంఘాలు..