Nandamuri Balakrishna: బాలయ్య పుట్టిన రోజుకు డబల్ సార్ప్రైజ్ ఉండనుందంట.. అభిమానులకు పండగే..

ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి.

Nandamuri Balakrishna: బాలయ్య పుట్టిన రోజుకు డబల్ సార్ప్రైజ్ ఉండనుందంట.. అభిమానులకు పండగే..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 07, 2021 | 6:09 PM

Balakrinshna:

ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. సింహ, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేసుకున్నాయి. దాంతో ఇప్పుడు వస్తున్న హ్యాట్రిక్ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అఖండ అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర. ఆ మధ్య ఈ సినిమానుంచి ఓ టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్ ఆ టీజర్ లో బాలయ్య చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఇటీవల టైటిల్ ను అనౌన్స్ చేస్తూ.. మరో టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో బాలయ్య అఘోర గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ రెండు వీడియోలు సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి.

ఇక బోయపాటి సినిమా అంటేనే యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరు. ఇక ఈ సినిమా కూడా పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా తర్వాత క్రాక్ తో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు బాలయ్య. ఈ సినిమా ఫ్యాన్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని తెలుస్తుంది. బాలయ్య బర్త్ డే సందర్బంగా ఈ రెండు సినిమాల నుండి అప్ డేట్ రాబోతున్నాయి. అఖండ సినిమా ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ వచ్చేశాయి. కనుక పాటను లేదా ట్రైలర్ ను విడుదల చేసే అవకాశం ఉందని  తెలుస్తుంది. అలాగే గోపీచంద్ సినిమానుంచి మూవీ టైటిల్ ను రివీల్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇలా బాలయ్య పుట్టిన రోజున అభిమానులకు రెండు సార్ ప్రైజ్లు  ఉండనున్నాయని తెలుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nandamuri Balakrishna: “ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను”.. బాలకృష్ణ ఎమోషల్ పోస్ట్..

Chiranjeevi: క్రేజీ న్యూస్.. మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ తెలుగు రీమేక్ సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనా..