AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Dhanush : తెలుగు పై మనసు పారేసుకుంటున్న తమిళ్ స్టార్లు.. స్ట్రెయిట్ మూవీ చేయనున్న హీరో..

విభిన్నమైన సినిమాలతో తన వర్సటైల్‌ యాక్టింగ్ తో పాన్‌ ఇండియా రేంజ్‌లో పాపులర్‌ అవుతున్న హీరో ధనుష్‌. ఈ యంగ్ హీరో స్టార్ హీరో అయినప్పటికీ చిన్న దర్శకులతో సినిమాలు..

Actor Dhanush : తెలుగు పై మనసు పారేసుకుంటున్న తమిళ్ స్టార్లు.. స్ట్రెయిట్ మూవీ చేయనున్న హీరో..
Rajeev Rayala
|

Updated on: Jun 07, 2021 | 5:50 PM

Share

Actor Dhanush : విభిన్నమైన సినిమాలతో తన వర్సటైల్‌ యాక్టింగ్ తో పాన్‌ ఇండియా రేంజ్‌లో పాపులర్‌ అవుతున్న హీరో ధనుష్‌. ఈ యంగ్ హీరో స్టార్ హీరో అయినప్పటికీ చిన్న దర్శకులతో సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. అంతే కాదు తన అద్బుతమైన నటనతో ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకుంటున్నాడు ధనుష్. ఈ కుర్ర హీరో ఇప్పుడు స్టార్ హీరో దళపతి విజయ్‌ను ఫాలో అవుతున్నారు. విజయ్‌ లాగే తాను కూడా స్ట్రెయిట్గానే రచ్చ గెలుస్తానని అంటున్నారు. రీసెంట్‌గా జగమే తంత్రం సినిమాను ఓటీటీ వేదికగా రిలీజ్‌ కు సిద్దం చేసిన ధనుష్‌… స్టార హీరో విజయ్‌ లాగే ఓ స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయబోతున్నారట. ఇప్పుడిదే విషయం అటు కోలీవుడ్ లోనూ.. ఇటు టాలీవుడ్లోనూ వైరల్ గా మారింది. ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌, స్టార్ డైరెక్ట‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారట. ఆ సినిమాలో హీరోగా ధనుష్‌ నటిస్తే బాగుంటుందని భావించి ఈ యంగ్ హీరోని సంప్ర‌దించార‌ట‌.

ఇక మంచి క‌థ దొరికితే టాలీవుడ్లోకి నేరుగా ఎంట్రీ ఇద్దామ‌ని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ధనుష్‌ కూడా.. వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక ఓకే చెప్పేశారట. ఇక వ‌చ్చే ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళనుందని ఇండస్ట్రీలో టాక్‌ కూడా వినిపిస్తోంది. ఈ న్యూస్ ఎంత వరకు నిజమవుతుందో ముందు ముందు చూడాలి మరి!

మరిన్ని ఇక్కడ చదవండి :

Nandamuri Balakrishna: “ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను”.. బాలకృష్ణ ఎమోషల్ పోస్ట్..

Chiranjeevi: క్రేజీ న్యూస్.. మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ తెలుగు రీమేక్ సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనా..

Puri Jagannath: మరోసారి ఆ మెగా హీరోతో డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ సినిమా.. ఫ్యాన్స్ కు పూనకాలే..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!