Nandamuri Balakrishna: “ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను”.. బాలకృష్ణ ఎమోషల్ పోస్ట్..

తెలుగు రాష్ట్రాల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు సినిమా వస్తుందంటే అంటే..

Nandamuri Balakrishna: ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను.. బాలకృష్ణ ఎమోషల్ పోస్ట్..
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 07, 2021 | 4:50 PM

Nandamuri Balakrishna: తెలుగు రాష్ట్రాల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు సినిమా వస్తుందంటే అంటే అభిమానులకు పండగేనే చెప్పాలి. పూలాభిషేకాలు, పాలాభిషేకాలు ఆ హడావిడి మాములుగా ఉండదు. అదే బాలయ్య పుట్టిన రోజు అంటే అభిమానులకు పండగే.. ప్రతిఏటా బాలయ్య పుట్టిన రోజును అభిమానులు ఘనంగా జరుపుకుంటారు. కానీ ఈ ఏడాది తన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసారు. ” నా ప్రాణ సమానులైన అభిమానులకు .. ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని . కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు . నన్నింతటివాడ్ని చేసింది మీఅభిమానం.  ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను . మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు. మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు. మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక . దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ .ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ ..మీ నందమూరి బాలకృష్ణ”అంటూ రాసుకోచ్చారు.

ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందని టాక్. అలాగే బాలయ్య తో సినిమా చేయాలనీ అనీల్ రావిపూడి ప్రయత్నాలు చేస్తున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Chiranjeevi: క్రేజీ న్యూస్.. మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ తెలుగు రీమేక్ సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనా..

Puri Jagannath: మరోసారి ఆ మెగా హీరోతో డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ సినిమా.. ఫ్యాన్స్ కు పూనకాలే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!