Pawan Kalyan: కొత్త సమస్యతో బాధపడుతోన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్.. అర్ధరాత్రిళ్లు నిద్ర లేచి..
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కొన్ని రోజుల పాటు అక్కడే చికిత్స అందించి ఇటీవలే మార్క్ శంకర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ తీవ్రంగా గాయ పడ్డాడు. ఊపిరితిత్తులలోకి పొగ వెళ్లడంతో బ్రాంకోస్కోపీ ట్రీట్మెంట్ చేయించారు. కొన్ని రోజుల పాటు సింగపూర్ లోనే చికిత్స చేయించిన పవన్ దంపతులు మార్క్ శంకర్ ను ఇటీవలే హైదరాబాద్ తీసుకొచ్చారు. దేవుడి దయతో తన కుమారుడు క్రమంగా కోలుకుంటున్నాడని, అంతా బాగానే ఉందని పవన్ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు పవన్ కల్యాణ్. పహల్గామ్ మృతులకు నివాళి ఆర్పించడంలో భాగంగా తాజాగా మంగళగిరిలో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో మాట్లాడిన పవన్ కల్యాణ్ తన కొడుకు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. ‘ఇటీవల నా కొడుకు సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. అందులో ఒక బాలుడు చనిపోగా, ఒకరికి కాళ్ల, చేతులు కాలిపోయాయి. నా కొడుకు ఊపిరితిత్తులలోకి పొగ వెళ్లింది. ఈ దుర్ఘటన నుంచి నా కుమారుడు ఇంకా పూర్తిగా తేరుకోలేకపోతున్నాడు. నా కొడుక్కి అర్ధరాత్రి పూట ఉలిక్కి పడుతున్నాడు. ఆ మేడ మీద నుండి పడిపోతున్నట్టు పీడకలలు వస్తున్నాయి.ఈ ట్రామా, భయాన్ని తగ్గించేందుకు సైకియాట్రిస్ట్ ట్రీట్ మెంట్ ప్రస్తుతం చేయిస్తున్నాం’ అని పవన్ చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, జనసేన శ్రేణులు కోరుకుంటూ నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు. కాగా మార్క్ శంకర్ కోలుకోవాలని కోరుకుంటూ పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి మొక్కులు సమర్పించారు. తలనీలాలు సమర్పించడంతో పాటు అన్నదానం కూడా నిర్వహించారు.
ఇక పవన్ కల్యాణ్ ఒకవైపు ఆంధ్ర ప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరొకవైపు తన ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇందులో ముందుగా హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




