Hari Hara Veeramallu: హరి హర వీరమల్లు టికెట్ ధరలు పెంపు.. ఒక్క టికెట్ రేట్ ఎంతో తెలుసా.. ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ హరి హర వీరమల్లు. మొదట ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించగా.. ఆ తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. జూలై 24న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత తమ హీరో నుంచి వస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. మొదటి క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఈ సినిమా నుంచి క్రిష్ తప్పుకోవడంతో జ్యోతికృష్ణ దర్శకత్వ బాధత్యలు తీసుకున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ వేగంగా జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు అడియన్స్ ముందుకు రాబోతుంది. జూలై 24న ఈ మూవీని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్స్ సైతం షూరు చేసింది చిత్రయూనిట్. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.
హరి హర వీరమల్లు సినిమా ప్రదర్శనకు సంబంధించి టికెట్లు రేట్లు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ఈ నెల 23వ తేదీన రాత్రి 9 గంటలకు నిర్వహించబోయే ప్రీమియర్ షో కోసం ఒక్కో టికెట్‌ను రూ.600 వరకు విక్రయించుకునేందుకు వీలు కల్పించింది. ఇది జీఎస్టీ అదనంగా చెల్లించే విధంగా నిర్ణయించారు. అంతేకాక, సినిమా విడుదలైన 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు పది రోజుల పాటు సాధారణ థియేటర్లలోనూ, మల్టీప్లెక్స్ థియేటర్లలోనూ టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు.
టారిఫ్ ఇలా…
సాధారణ థియేటర్లలో లొయర్ క్లాస్ టికెట్ ధరను రూ.100 వరకు పెంచుకోవచ్చు. అప్పర్ క్లాస్ టికెట్ ధరను రూ.150 వరకు పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్ లలో టికెట్ ధరను రూ.200 వరకు పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. ఇది వరకూ టికెట్ ధరల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిబంధనల్ని పక్కన పెట్టి, 2022లో విడుదలైన జీవో-13లో పేర్కొన్న పరిమితులపై మినహాయింపు ఇస్తూ, సినిమా నిర్మాత ఏ.ఎం.రత్నం వినతిని అనుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ జీవో ప్రకారం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, లైసెన్సింగ్ అధికారులు, పోలీస్ కమిషనర్లు ఈ ధరల అమలును పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సినిమా నిర్మాణ సంస్థకు ప్రత్యేక ఆదాయం లభించే అవకాశం కలుగుతోంది.
ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..








