AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hari Hara Veeramallu 2nd Day Collections: హరిహర వీరమల్లు రెండో రోజు కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..

హరిహర వీరమల్లు.. జూలై 24న భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. డైరెక్టర్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలోని సాంగ్స్ సైతం హిట్టయ్యాయి.

Hari Hara Veeramallu 2nd Day Collections: హరిహర వీరమల్లు రెండో రోజు కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..
Hari Hara Veeramallu
Rajitha Chanti
| Edited By: |

Updated on: Jul 26, 2025 | 3:26 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. జూలై 24న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చారిత్రాత్మకమైన ఓపెనింగ్ చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొత్తం 70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అంటే.. ప్రీమియర్ షోస్ ద్వారా రూ.12.7 కోట్లు నెట్ కలెక్షన్స్ రాగా.. రూ.47.5 కోట్ల వసూల్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఇప్పుడు రెండో రోజు సైతం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇవి కూడా చదవండి: Rekha Vedavyas: చాలా నరకం అనుభవించాను.. మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..

శుక్రవారం ఇండియాలో రూ.8 కోట్ల నెట్ వసూల్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో మొత్తం రెండు రోజుల కలెక్షన్స్ కలిపి రూ.55.5 కోట్లుగా వసూలు చేసింది. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 24.42% ఆక్యుపెన్సీని చూసింది. ఉదయం షోలలో 17.75 %తో ప్రారంభించి.. మధ్యాహ్నం 20.17%, సాయంత్రం 27.21%, రాత్రి షోలలో 32.53% చేరుకుంది. ఇక మహబూబ్ నగర్, హైదరాబాద్, వరంగాల్ ప్రాంతాల్లో 45.25%, 31.50%, 28.75% ఆక్యుపెన్సీ సాధించింది. ఇక ఈ వీకెండ్ శని, ఆదివారాల్లో కలెక్షన్స్ మరింత పుంజుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:  Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..

తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడలో విడుదలైన ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి రెస్పాన్స్ ఎక్కువగానే వస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించగా.. సత్యరాజ్, సునీల్ కీలకపాత్రలు పోషించారు. ఇందులో దివంగత నటుడు కోట శ్రీనివాసరావు కాసేపు కనిపించారు.

Movie: 13 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ సెన్సేషన్ ఈ సినిమా.. చూస్తూ వణికిపోయిన జనాలు..

Tollywood: ఇండస్ట్రీలోకి ఫ్లాప్ హీరోయిన్.. హిట్ల కంటే ప్లాపులే ఎక్కువ.. కానీ కాలు కదపాలంటే కోట్లు ఇవ్వాల్సిందే..