War 2 : వార్ 2 మొత్తం బడ్జెట్ ఇదే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే..
ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇదివరకు విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేయగా.. శుక్రవారం రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంది.

వార్ 2. ప్రస్తుతం భారతీయ సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఇది ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా కనిపించింది. స్పై యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ ఇద్దరు స్టార్ హీరోల స్టైల్, యాక్షన్, డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. శుక్రవారం విడుదలైన వార్ 2 ట్రైలర్ ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రైలర్ లో యాక్షన్ విజువల్స్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. YRF స్పై యూనివర్స్‌లో భాగంగా వస్తున్న ఈ సినిమా విడుదల కోసం ప్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Rekha Vedavyas: చాలా నరకం అనుభవించాను.. మానసికంగా కుంగిపోయాను.. టాలీవుడ్ హీరోయిన్..
ఇదిలా ఉంటే.. వార్ 2 సినిమాను రూ.210 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొదటి వార్ సినిమా కంటే ఎక్కువ బడ్జెట్ ఇది. గతంలో ఫస్ట్ వార్ సినిమాను కేవలం రూ.170 కోట్లతో నిర్మించారు. ఇక ఈ సినిమాలో హృతిక్ తన పాత్రకు గానూ రూ.48 కోట్లు తీసుకుంటుండగా.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తారక్ వార్ 2 కోసం రూ.30 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. ఇక ఈ సినిమాకు కియారకు రూ.15 కోట్లు.. డైరెక్టర్ అయాన్ ముఖర్జీకి రూ.32 కోట్లు పారితోషికం అందుతుందట.
ఇవి కూడా చదవండి: Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..
ఇప్పటివరకు ఈ సినిమాను స్పెయిన్, జపాన్, అబుదాబి వంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు. హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో ఓ స్పెషల్ సాంగ్ సైతం ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. వార్ 2 సినిమాను ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు.
వార్ 2 ట్రైలర్..
Movie: 13 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పటికీ సెన్సేషన్ ఈ సినిమా.. చూస్తూ వణికిపోయిన జనాలు..







