MM Keeravani: నంది టూ ఆస్కార్ స్వరవాణి కీరవాణి ప్రస్థానం.. ఇప్పుడు ఆయనకు మరో అవార్డు

నంది టూ ఆస్కార్ స్వరవాణి కీరవాణి ప్రస్థానం.. ఇప్పుడు మరో అవార్డు. పద్మ అవార్డుల్లో ఈ సంగీత దర్శకుడిని పద్మశ్రీ వరించింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీరవాణి ఇప్పుడీ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాన్ని అందుకోబోతున్నారు.

MM Keeravani: నంది టూ ఆస్కార్ స్వరవాణి కీరవాణి ప్రస్థానం.. ఇప్పుడు ఆయనకు మరో అవార్డు
Mm Keeravani Received Padma Shri
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 05, 2023 | 7:44 PM

మ్యూజిక్ డైరెక్టర్ MM కీరవాణికి మరో గౌరవం దక్కింది. 2023కుగాను కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఈ సంగీత దర్శకుడిని పద్మశ్రీ వరించింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీరవాణి ఇప్పుడీ ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఎంఎం కీరవాణి.. తన వినసొంపైన బాణీలతో దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సంగీత దర్శకుడు. కెరీర్లో ఎన్నో వేల పాటలను కంపోజ్ చేశాడు. అయితే గతేడాది ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రం కీరవాణిని మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఈ సినిమాతో అతడు అంతర్జాతీయ గుర్తింపు అందుకున్నారు.

1987లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీరవాణి..మ్యూజిక్ డైరెక్టర్లు చక్రవర్తి, సి. రాజమణి తదితరుల వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత మూడేళ్ల వ్యవధిలోనే ‘మనుసు మమత’ అనే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసిన కీరవాణి.. ఆ వెంటనే ‘మరకతమణి’ మూవీతో టాలీవుడ్‌లో పాగా వేశారు. వాస్తవానికి మనుసు మమత మూవీ కంటే ముందు ‘కల్కి’ అనే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణి పని చేశారు. కానీ.. ఆశ్చర్యంగా ఆ మూవీ పాటలు బయటికి వచ్చాయి..కానీ సినిమా మాత్రం రిలీజ్ కాలేదు.

తన కెరీర్‌లో కీరవాణి ఇప్పటి వరకూ నేషనల్ అవార్డుతోపాటు 8 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 11 నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. కీరవాణి కెరీర్‌లోనే ది బెస్ట్ అనిపించే మూవీ అన్నమయ్య. 1997లో రిలీజైన ఈ మూవీలోని ప్రతి పాట సూపర్ హిట్‌గా నిలిచింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కీరవాణికి ఈ మూవీతో నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. అలాగే క్రిమినల్, క్షణం క్షణం సినిమాలు కూడా మ్యూజికల్ హిట్స్‌గా అప్పట్లో నిలిచాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం